ఫరూక్ అబ్దుల్లా : ఓ మతిమాలిన నేత..ఔట్‌డేటెడ్ మైండ్‌లెస్ ఫెలో


రాజకీయాల్లో కొనసాగడానికి కూడా ఏజ్ లిమిట్ పెడితే బావుండనేది చాలామంది కోరిక..కానీ మన పాలిటిక్స్ కి సంబంధించినంతవరకూ యాభైఏళ్లు దాటితేనే యువనేత..ఆ తర్వాతే కాస్తంత పదవులు దక్కేది..అలా 60-70 ఏళ్ల మధ్య పవర్ పగ్గాలు చేపట్టినోళ్లే ఎక్కువ..కానీ ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్లని చూస్తే మళ్లీ వయోపరిమితి విషయం గుర్తొస్తుంటుంది..వీళ్లు గడ్డివాముల దగ్గర కాపలాకుక్కల్లా..(సారీ అవి కూడా బాధపడతాయ్) వాళ్లు దేశానికి చేసేది లేదు..ఇంకోళ్లని చేయనీయరు..పైగా చెడగొట్టేటందుకు..విషం నాటేందుకు బాగా ఉపయోగపడుతుంటారు..ఈయనగారు రీసెంట్‌గా పాక్ ఆక్రమిత కశ్మీర్ ..పాకిస్తాన్‌దే అని..దాని కోసం ఎన్ని యుధ్దాలైనా జరగనీ..ఎప్పటికీ మనది కాదంటూ ప్రవచనాలు వల్లించారు..అసలు దేశం తరపున ఎంపికై..దేశంలోనే బతుకుతూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటోళ్లు..భూమికి భారం అనడంలో సందేహం లేదు..రాజకీయంగా ఎంత ఉన్నతపదవులు అనుభవించినా వాటికి మాకు అర్హత లేదు అని ఇలాంటి మాటలతోనే వాళ్లకి వాళ్లే రుజువు చేసుకుంటారు. అదేం జబ్బో కానీ..ప్రతివాడికీ లోకంతీరుకు వ్యతిరేకంగా మాట్లాడితే మంచి ప్రచారం వస్తుందనుకుంటారో..లేక మనసులోని అసలు మాటో ఏమోకానీ..ఇలా వాగుతుంటారు..కశ్మీర్ లోయలో ఓ వర్గాన్ని దువ్వడానికే ఇలాంటి కూతలు కూస్తారంటారు..ఐనా ఇలాంటి విషయంలో ఇతగాడి పుత్రరత్నం కాస్త బెటర్ అన్పిస్తాడు.

ఐనా జమ్ము కశ్మీర్‌లో ఇదివరకటిలా సిచ్యుయేషన్ లేదు. బిజెపి కూడా తన ప్రాబల్యం చాటుకుందంటే..అక్కడి ప ్రజల ఆలోచనలో వచ్చిన మార్పుకి సంకేతం..అక్కడా స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయ్. అక్కడ కూడా డెవలప్‌మెంట్ బేస్డ్‌గా మేనిఫెస్టోలు వస్తున్నాయ్..(ఓవైపు పెల్లెట్ దాడులు, ఎన్‌కౌంటర్‌లు ఉన్నా కూడా)..ఐనా ఇలాంటి మతిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటే..మైండ్‌లెస్ లీడర్లకి గుడ్‌బై చెప్పాల్సిన టైమ్ వచ్చిందేమో 

Comments