ఓ మంచి పుస్తకం..ఎందుకు దూరమవుతోంది..!


చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో..ఓ మంచి పుస్తకం కొనుక్కో! ఈ నినాదం గ్రంథాలయాలకు(లైబ్రరీల)కు వెళ్లే ప్రతి ఒక్కరికీ తెలుసు.  ఐతే ఇప్పుడు ఏ తెలుగు గ్రామం. పట్టణంలోని లైబ్రరీలకు వెళ్లినా..చిరిగిన పుస్తకాలే తప్ప చక్కగా చదువుకునే వాతావరణమే కన్పించదు..దీనికి అసలు కారణం మన లీడర్లే అంటే పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోరు. ఎందుకంటే, ప్రతి జిల్లా గ్రంధాలయ సంస్థకి ఓ ఛైర్మన్ ని నామినేట్ చేయడమే తప్ప..వాటికి జవసత్వాలు ఇవ్వాలనే ధ్యాసే ఉండదు..నిజంగా మనం కట్టే ప్రతి పన్నులోనూ లైబ్రరీ సెస్ ఉంటుంది..
ఒక్క హైదరాబాద్‌నే తీసుకుందాం..జీహెచ్ఎంసి ఈ ఏడాదికి రూ.1200కోట్లు ఆస్తి పన్ను రూపంలో వసూలు చేసింది..ఇందులో 8శాతం ఖచ్చితంగా దాని పరిధిలోని లైబ్రరీలకు పంచాలి..

కానీ పంచుతుందా..లేదు..ఎనిమదిశాతం పన్ను ఉంటే రూ.96కోట్లు..కానీ..పంచింది ఎంతో తెలిస్తా ఛ..ఏం బతుకులు రా అన్పించకమానదు..కేవలం 15లక్షలు..అంటే చేయాల్సిన పని చేయకుండా..ఊరికే..ఈ-లైబ్రరీలంటూ హడావుడి చేస్తారన్నమాట..ఇది చదివిన వారికి అబ్బో అబ్బో ఎంత డెవలప్ మెంట్..ఎంతైనా మనోళ్లు గొప్పోళ్లబ్బా అనుకోవాలని వారి ఫీలింగ్..ఇది ఒక్క హైద్రాబాద్ లెక్కలే..ఇక అన్ని చోట్లా ఇదే రేంజ్ లెక్కలు తీస్తే అప్పుడు సెస్ రూపంలో మున్సిపల్ కార్యాలయాలు..కార్పొరేషన్లు ఎంత బొక్కేస్తుందీ తెలుస్తుంది..


మరిప్పుడు చెప్పండి..చిరిగిన చొక్కాలు తొడుక్కోవడం సంగతి అటుంచండి..చదవడానికి ఓ మంచి పుస్తకమే ఎందుకు లైబ్రరీల్లో దొరకడం లేదో అర్ధమైపోవడం లేదూ

Comments