ఇది చదివితే ఇక ఉల్లి తొక్కలను కూడా వదలరు


ఉల్లిపాయల రేటు కేజీకి వంద రూపాయలవరకూ వెళ్లే ప్రమాదం ఉంది. ఈ టైమ్‌లో ఉల్లిపాయల గురించి కాసేపు మాట్లాడుకుందాం. హెల్త్ పరంగా బాగా ఉపయోగపడుతుందనే ఉల్లిపాయను ఎవరైనా డ్రెస్సింగ్ చేసే వాడతారు.కానీ ఏదైతే మనం కట్ చేసి పారేస్తున్నామో..అదే ఇంకా ఆరోగ్యాన్నిస్తుందట..అదెలానో చూద్దాం..ఉల్లితొక్కల్లోనే క్వార్స్టైన్ అనే ఫ్లేవనాల్ ఉంటుంది..ఇది బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేస్తుందట..మరి ఇదెంత గొప్ప విషయం బిపి డౌన్ ..బిపి రైజ్ అయ్యి బాధపడేవాళ్లకి ఈ న్యూస్‌ని తొక్కలా తీసిపడేయగలరా? దాంతో పాటే రక్తాన్ని మోసుకెళ్లే ధమనులు..సిరలు గడ్డకట్టకుండా కాపాడతాయట..ఆనియన్ తొక్కల్లో బోలెడంత ఫైబర్..ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయట ఇవి కరోనరీ ఆర్టరీ డిసీజెస్(గుండెనరాల జబ్బులు) రాకుండా చూస్తాయట(తింటే)


1. లో డెన్సిటీ కొలెస్టరాల్‌ని తగ్గిస్తాయ్

2. బిపి క్రమబద్దం చేస్తాయ్
3. డిప్రెషన్‌ని తగ్గిస్తాయ్
4. కండరాలు పెరగడానికి , సరిగా పనిచేయడానికి 
5. వాపు తగ్గించడంలోనూ ఉల్లితొక్కలదే కీలక పాత్ర


కానీ ఈ తొక్కలను ఎలా వాడాలనేది మరో సమస్యే కదా..

  1.  ఈ తొక్కలనే సూప్‌లలో వాడుకుంటే సరి..తిన్నా తినకపోయినా..వాటిలో ఫ్లేవనాయిడ్స్ సూప్‌లో కరుగుతాయ్ కాబట్టి లాగించేయవచ్చు...
  2.  టీ బాల్‌లా వాడుకోవచ్చట. మరుగుతున్న నీటిలో నానబెడితే డికాషన్‌లా వాడుకోవచ్చు
  3. లెగ్ క్రాంప్స్ అంటే కాలు కొంకర్లు పోయినప్పుడు ఈ ఉల్లితొక్కలను రాత్రిపూట బాగా నూనెలో వేయించి..(15-20నిమిషాలు) తర్వాత ఈ ద్రవాన్ని బాగా వడకట్టితాగితే...కొంకర్లు పోవడం తగ్గుతాయట ఐతే ఓ వారం చేయాలట ఇంకా...ఇలాంటివి చాలా ఉన్నాయ్....గుర్తొచ్చినప్పుడు మాట్లాడుకుందాం

Comments