పడేశారు..పిడిగుద్దులు గుద్దారు..! ఇండిగో స్టాఫ్‌పై వరసగా కంప్లైంట్లు


ఇండిగో సంస్థకి ప్రపంచంలోనే అత్యంత మర్యాద పూర్వకమైన సంస్థగా (బెస్ట్ ఆపరేషనల్ ఎక్స్‌లెన్సీ )అవార్డు దక్కించుకుంది..ఐతే ఇప్పుడు బైటకొచ్చిన వీడియో మాత్రం అదంతా తీసిపారేసింది..ఈ ఒక్క ఇన్సిడెంట్‌‍తో మొత్తం సంస్థని తప్పుబట్టలేం కానీ..సదరు పాసింజర్‌పై జరిగిన దాడి చూస్తే మాత్రం అసలు వీళ్లని సస్పెండ్ చేయడం కాదు మర్డర్ కేసు పెట్టాలనిపించకమానదు. ఇక్కడ ఎవరి తప్పుందో క్లియర్‌గా కన్పిస్తూనే ఉంది..  ఓ పాసింజర్ నిజంగా అవసరమైన డాక్యుమెంట్లు చూపకపోతే, బస్సులోకి అనుమతించకపోవచ్చు కానీ..ఇలా కింద పడదోసి..ఇద్దరు రౌండాఫ్ చేసి..ఒకరు గొంతు నొక్కుతూ..ఇంకొకరు గుద్దులవర్షం కురిపించడం భయానకమైన దృశ్యమే! ఐతే వీడియోలో పాసింజర్ కూడా తక్కువేం తినలేదు..బాగానే ప్రతిస్పందించాడు..కానీ అతనిపైనే సానుభూతి కురుస్తోంది

ఐతే ఈ వీడియోలో చూసిన సన్నివేశం అక్టోబర్ 15న జరిగిందట. స్వయంగా ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్ మాటల్లోనే ఆ రోజు ఏం జరిగిందో చదవండి
:" ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ కాదు..అక్టోబర్ 15న. జరిగిన రోజే బాధితుడిని వ్యక్తిగతంగా పిలిపించుకుని క్షమాపణ చెప్పాము. ఈ ఘటనలో మేం కస్టమర్‌ని నిందించడం లేదు..అలాగని ఉద్యోగులకు మద్దతు పలకలేదు.
వెంటనే ఈ ఎపిసోడ్‌లో ఇన్వాల్వ్ అయిన ఉద్యోగులను సస్పెండ్ చేశాం.
ముందుగా పాసింజర్‌ని బస్ ఎక్కకుండా ఆపమని అరిచిన ఉద్యోగి మిగిలిన ఇద్దరి కంటే సీనియర్..లాజిస్టిక్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వ్యక్తి..అతను ఆ సమయంలో సరిగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. అతనికి ఈ వ్యవహారంలో సంబంధమే లేదు.  అతను ఇండిగో కోడ్ ఆప్ కండక్ట్‌కి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి, అతనిని వెంటనే తొలగించాం. కస్టమర్లని గౌరవంగా రోజూ కొన్ని వేలమందిని గమ్యస్థానాలకు చేర్చుతుంటాం. ఇది మాకు ఓ పాఠం లాంటిది. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా చూసుకుంటాం.
ఇదిగో ఇక్కడ ఆ వీడియో చూడండి



నాలుగు రోజుల క్రితమే పి.వి.సింధుతో కూడా ఓ ఎంప్లాయీ ఇలానే దురుసుగా బిహేవ్ చేసాడని కంప్లైంట్ ఇవ్వడం చూశాం. మరి వరసగా వచ్చిపడుతోన్న కంప్లైంట్లు ఇండిగో క్రెడిబులిటీ దెబ్బతినడం ఖాయం

Comments