రాహుల్ గాంధీ పంచ్..ఈసారి ఐకిడో


రాహుల్ గాంధీ ఈ మధ్య బాగా పంచ్‌లు పేలుస్తున్నాడు..పొలిటికల్‌గా బాగా పేలుతున్నాయ్ కూడా..ఐతే ఈ సారి తన రియల్ పంచ్ చూపిస్తానంటూ ఫోటోలు పోస్ట్ చేశాడాయన. ఐకిడో అనే ఫైటింగ్ లో తనకి బాగా ప్రవేశం ఉందంటూ సదరు ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు ట్విట్టర్లో..! ఇవి కూడా బాగానే పేలాయ్.

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లలో ఇలాంటి పోరాటవిద్యలు ప్రదర్శించేవాళ్లు తక్కువ..అందులోనూ నిజజీవితంలో వారికా ఛాన్సే రాదు. యాబైఏళ్లు దగ్గరపడుతున్నా..థర్టీ ప్లస్‌లా మాంఛి దిట్టంగా కన్పించే రాహుల్..బహశా ఇలాంటి కసరత్తులూ గట్రా బాగా చేస్తాడేమో ఫిట్‌గా ఉంటాడు

రష్యా అధినేత పుతిన్‌ కూడా ఇలాంటి పోరాటవిద్యలు అప్పుడప్పుడూ ప్రదర్శిస్తుంటాడు. ఆయనలాగే రాహుల్ కూడా కరాటే తెలిసి ఉఁడటం కాంగ్రెస్ వర్గాలకి ఆనందాన్నిచ్చేదే..తమ నేతకి ఇంకాస్త బాజా వాయించడానికి ఇదో ఛాన్స్ ఇచ్చినట్లై..ఈ ఫోటోలు యువతరానికి నచ్చితే కాస్త యూత్‌లో కూడా ఫాలోయింగ్ పెరుగుతుందనుకోవచ్చు మరి..!

Comments