ఆపరేషన్ భూమా! ఫలితం తొందర్లోనే


టిడిపిలో ఆపరేషన్ భూమా ప్రారంభమైనట్లు గుసగుసలు విన్పిస్తున్నాయ్. కృష్ణానదిలో ఫెర్రీ రీచ్ దగ్గర పడవ బోల్తా..అందులో ప్రకాశం జిల్లావాసులు చనిపోయిన తర్వాత దుమారం బాగానే రేగింది. ప్రమాదం జరిగిన కాసేటికే వైఎస్సార్సీపీ లీడర్లు వెళ్లడం...విషయం తీవ్రత తెలుసుకున్న తర్వాత టిడిపి నేతలు కూడా అక్కడకు చేరుకోవడం వెంటవెంటనే జరిగాయ్. ఏదైతేనేం ప్రాణాలు పోయాయ్..ఇది టూరిజం శాఖ పరిధి  అని అప్పుడే కొంతమంది కామెంట్ చేయడం భవిష్యత్ పరిణామాలకు సూచికగా అర్ధమైంది. ఐతే అది అర్ధమైనవాళ్లకి అర్దమైంది కానీ అసలు మనుషులకు మాత్రం అర్ధం కాలేదు..

తాజాగా సిఎం కామెంట్స్‌తో ఆ అసలు మనుషులకు కూడా  విషయం విశదీకృతమైపోయింది. " గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా శాఖల మంత్రులే బాధ్యత వహించేవారు..రాజీనామా చేసేవారు" అని అధినేత కామెంట్ చేయడంతో పాటు.."అది మీ శాఖ కాబట్టే మీదే కదా బాధ్యత" అని మాట్లాడటంతో అఖిలప్రియకి నోట మాట రాలేదట( ఇది నిర్ధారించబడని వార్త..ఎందుకంటే ఈనాడు, జ్యోతిలానే ఇన్‌సైడ్ సమాచారం ఇది మీకెక్కడా దీనికి సంబంధించిన విజువల్ కానీ..శబ్దం కానీ కన్పించదు విన్పించదు). అదే నిజమైతే..గతంలో పుష్కరాల సమయంలో చోటు చేసుకున్న విషాదంపై ఎవరు బాధ్యత తీసుకోవాలనే మాట విన్పిస్తున్నా..అదడిగే ధైర్యం లేదు ఎవరికీ..అలానే రోజూ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎవరు బాధ్యులు? ఎందుకంటే నారాయణ విద్యాసంస్థల్లో సూసైడ్లు చేసుకుంటున్న సంగతి..అటు విద్యాశాఖామంత్రికి..ఇటు పురపాలిక అమాత్యులకు ఎవరికి తెలీదు..ఐనా వాళ్లేమైనా రెస్పాండ్ అవుతున్నారా..ఏదైనా ఓ దుర్ఘటన జరిగినప్పుడు బాధ్యత తీసుకోవడం, స్పందించడం అన్నది మంచిదే ఐతే  అది అందరికీ వర్తించాలి కదా

ఈ విషయాలు పక్కనబెడితే..భూమా వారసురాలికి ఓ చిన్న కుదుపు అయితే అనుభవమైంది. ఇంకా ఇలాంటి షాకులు ఎదురవుతూనే ఉంటాయ్. ఇలాంటివన్నీ దులిపేసుకుంటునే మంత్రులుగా నిలబడతారు..ఏ మాత్రం రోషం తెచ్చుకుంటే చివరికి పాతగూటికే చేరాలి.  అలా రీసెంట్ డెవలప్‌మెంట్స్ చూస్తే  ఆపరేషన్ భూమా మొదలైనట్లే అర్ధం అవుతోంది

Comments