శభాష్! రాజగురూ..ఇదీ ప్రభుభక్తి చాటుకునే తీరు!


రెండు మూడు రోజుల క్రితం వైఎస్ జగన్‌పై ఓ మంత్రి విమర్శ..అంతకుముందు ఇంకో లీడర్ ఆరోపణ..ఇవాళ ముఖ్యమంత్రి కామెంట్..ఇలా ప్రతి చోటా వాళ్లకి సంబంధించిన వార్తలు చాలా ప్రముఖంగా హెడ్‌లైన్స్‌లో పడేంత తీవ్రత ఉన్నవి కన్పిస్తున్నాయ్. ఛానళ్లలో వాయిస్ విన్పిస్తోంది కూడా! అది చూసినా..విన్నా ఎవరైనా ఆ మాటలు వారి నోట వింటే వినాలనుకునేలా వండి వార్చుతున్నారు..కానీ నిజంగా ఆ వీడియోలు చూస్తే..ఏముంది..అటూ ఇటూ తిరుగుతున్న విజువల్స్..ఏదో సీరియస్సుగా తెగ మాట్లాడేసుకుంటున్న దృశ్యాలు తప్ప..నిజంగా ఆ కామెంట్లు మాత్రం కన్పించడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌కి్ సంబంధించినంత వరకూ ఓ పత్రిక కాంగ్రెస్ వ్యతిరేక వార్తలు రాయడంలో దిట్ట..ఆ తర్వాత మరో పత్రికా జోడైంది. ఇప్పుడక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీ మారడంతోనే..ఆ రాజుగురుపత్రిక కూడా రూటు మార్చేసింది. అధినేత ఎలాంటి నిర్ణయం ప్రకటించినా దానికి అనుగుణంగా కథనాలు వచ్చేస్తాయ్.. అధినేత మనోభావాలకు అనుగుణంగా లీకులు వచ్చేస్తున్నాయ్. వాటికి తగ్గట్లుగా మంచి స్టోరీ అల్లడం " ఆయన అలా అన్నారు..ఇలా అన్నారు..బాధపడ్డారు..ఆవేదన వ్యక్తం చేసారు" వంటి ఇమేజీ పెంచే( అనుకుంటున్నారు..పెరిగేదీ తగ్గేదీ ఇప్పట్లో తేలదు) స్టోరీలతో  పాటు..ప్రత్యర్ది పార్టీలపై వాళ్లు చేసారో లేదో తెలీదు కానీ..వీళ్లే మంచి పంచ్ డైలాగులతో విమర్సలు కూడా వండేస్తున్నారు. తీరా అవి నిజంగా అన్నవో కాదా వీడియోలో చూద్దాం అని ఆసక్తిగా గమనిస్తే ఒక్కటంటే ఒక్క మాట ఉంటే ఒట్టు..ఉదాహరణకు
" ముఖ్యమంత్రి నంది అవార్డుల వ్యవహారంపై స్పందించారు..ఇలా రచ్చ జరుగుతుందనుకుంటే ఐవిఆర్ఎస్‌తో సర్వే చేయించేవాడిని.." వైఎస్ జగన్ పాదయాత్రని పట్టించుకోనక్కర్లేదు" ఆయన వాదనని కోర్టులే పట్టించుకోవడం లేదు" ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసినట్లుగా చెప్తారు..నిజానికి ఆయన అన్నదీ లేనిదీ అక్కడున్నవారికే తెలియాలి..కేవలం ఒకటి రెండు పత్రికలకే ఛానళ్లకే అంటే అందులో గూడార్ధం వారికే తెలియాలి..పైగా ఇలాంటి బిల్డప్పులను సమావేశం బైటికి వచ్చి ఎవరైనా చెప్పాలి..ఆ తర్వాత వాళ్లే పిఆర్ వ్యవస్థ ద్వారా తాబేదార్ ఛానళ్లకి బ్రేకింగుల కింద పంపిణీ చేయడం ఆ తర్వాత దానిపై స్పందన గమనించి..తిరిగి నేనలా అనలేదు అనో...అన్నాననో సర్ది చెప్పడం ఈ మధ్య బాగా చూడొచ్చు..కావాలంటే ఇవాళ లోకేష్, చంద్రబాబుగారి కామెంట్స్ ఎక్కడన్నా వీడియోలో దొరికితే మాకు పోస్ట్ చేయొచ్చు.

Comments