ఇప్పుడే ఎందుకు? జగన్ చెప్తే మాత్రం తప్పా? పోలవరం ఫ్యూచర్ మోడీ చేతుల్లోనా!



 ఏపి సిఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. కేంద్రం ఎందుకు పోలవరం పనులు ఆపాలని లేఖ  రాసిందని మండిపడ్డారు ఇవాళ. పైగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బిజెపి ఎమ్మెల్యేలను ఆయన పురమాయించడమే కాస్త హాస్యాస్పదంగా ఉంది. ఏకంగా అఖిలపక్షమే తీసుకెళ్లే అవకాశం ఆయన చేతిలో ఉండగా..బిజెపి ఎమ్మెల్యేలను దేబిరించడం ఎందుకు..అంతకు ముందు వైఎస్సార్సీపీ అధినేత  జగన్ బొచ్చెడు సార్లు ఢిల్లీకి పోదాం..హోదాపై మీ నాయకత్వంలోనే పోదాం...హోదా కావాలి...పోలవరమూ కావాలి అని అడుగుదాం అన్నప్పుడు. ".ఈయన చెబితే నే వెళ్లాలా..మాకున్నవయస్సంత లేదు ఈయన అనుభవం..ఈయన చెబితే నే నేర్చుకోవాలా " అంటూ ఎద్దేవా చేసినప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని చంద్రబాబు ఊహించి ఉండరు. 

పైగా రెవెన్యూ లోటు రూ.17వేల  కోట్లు ఉంటే..రూ.7వేలకోట్లే అంటోంది కేంద్రం, అలానే ఐఐటికి ఇచ్చింది 18వేలే అంటూఇవాళ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట చంద్రబాబు. అంటే ఈ ల ెఖ్కన కేంద్రప్రభుత్వంలోని మోడీగారు ఏపీకి ఏ మేర టోపీ పెట్టారో అర్ధమవుతూనే ఉఁది కదా..ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అటు  టిడిపిపై టార్గెట్ చేసి ఎన్నిసార్లు చెప్పినా..వాటిని కొట్టిపారేసి..."కేంద్రం బ్రహ్ మాండంగా పని చేస్తోంది...మాకు నమ్మకం ఉంది..ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది.. ఆ రకంగా ముందుకు పోతాం "అంటూ మీకే సాధ్యమైన హామీలు ప్రకటనలు ఇచ్చిన మాట వాస్తవం కాదా. సరే ఇవన్నీ దెప్పుడు మాటలే అనుకుందాం..ఇప్పటికైనా మించిపోయింది లేదు కదా..అందరికీ పిలుపు ఇవ్వండి ప్రత్యేక హోదా సహా అన్ని ఇష్యూలపై కలిసి వెళ్తాం రండి అనండి..జగన్ వచ్చేది లేనిదీ తర్వాత సంగతి.. ఓవేళ రాకపోతే ఎటూ మీరు చెప్తోన్న అభివృధ్ది నిరోధకుడనే పదం యాప్ట్ అవుతుంది కదా. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ రాయపాటినే కదా..ఆయన్ని బ్లాక్ లిస్ట్‌లోపెట్టాల్సిన పరిస్థితి ఉంటే పెట్టాలి..లేదంటే ఇంకోరికి ఇచ్చి పూర్తి చేయించాలి అంతేకానీ..కేంద్రం నిధులు ఇవ్వాలి...వాటిని నేనే ఖర్చు పెట్టాలి అంటే ఎలా..(ఓవైపు పురంధేశ్వరి ఇదే విషయంపై అరడజనుసార్లు  ప్రకటనలు కూడా ఇచ్చారు) పైగా ఇప్పుడు ఈ దశలో  ఇంకా 60వేల ఎకరాలకు పైగా భూమి సేకరించాలని చావు కబురు చల్లగా చెప్పడం ఏంటి?

ఇదంతా నిజంగా సిన్సియర్‌గా మీరు ఫీలైందేనా..లేక ఎటూ బిజెపితో ముందుకు పోయే పరిస్థితిని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత బేరీజు వేసుకోవడానికి ప్రిపేర్ చేస్తోన్న బ్యాక్ గ్రవుండా.? ఎటూ 2019లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్నుంచే ఓ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నారా..?
(మా రాతలు నచ్చేవారు చదవచ్చు..నచ్చనివారు అసలు చూడాల్సిన అవసరమే లేదు..ఎవరికైనా వ్యక్తిగతంగా కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది. అంతమాత్రాన వారేం చేస్తుంటే అదే గొప్ప అని పొగడాల్సిన అవసరం లేదు. ఇంకొకరిని తెగడాల్సిన అగత్యమూ లేదు. చెప్పేదాంట్లో వాస్తవం ఉఁదో లేదో గ్రహించండి..లేదూ  భజనే ఉందనుకుంటే ఇక ఈ బ్లాగుకి రావాల్సిన అవసరం లేదు )

Comments

  1. Why You are giving that disclaimer,in brackets:-)
    it is quite natural to be two sides for every issue:-(

    ReplyDelete

Post a Comment