రోశయ్యకి ఈ వయస్సులో కష్టాలు తప్పవా!


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో సిఎంగా పదవి చేపట్టిన రోశయ్య చాలా త్వరగానే తన పదవి కోల్పోవాల్సి వచ్చింది..ఐతే పక్కరాష్ట్రానికి గవర్నర్‌గా పంపడం ఏ ప్రాతిపదికన జరిగినా వైఎస్ జగన్ ప్రాభవాన్ని సరిగా డీల్ చేయకనే అని అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ ఫీలైంది..కిరణ్ కుమార్ రెడ్డిని సిఎఁని చేసింది. ఐతే రోశయ్య సిఎంగా ఉన్న సమయంలో అమీర్‌పేటలో ఓ టిడిపినేతకు కట్టబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానిపై ఇమ్యూనిటీ ప్రాతిపదికగా ఇన్నాళ్లూ తప్పించుకున్నా..తాజాగా సుప్రీంకోర్టు ఆయనకి వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటీషన్ పై విచారణ మొదలెట్టబోతోంది. దీంతో రోశయ్యకి జీవిత చరమాంకంలో( అంటే 80ఏళ్లు దాటాయి కాబట్టి) కోర్టులు చుట్టూ తిరిగాల్సి వచ్చేట్లు కన్పిస్తోంది.
ప్రభుత్వానికి సంబంధించిన భూమిని డీనోటిఫై చేసి ఇతరులకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఐతే ఇది వేరేవారికి లాభం కోసమే అని కె.మోహన్ లాల్ అనే వ్యక్తి ఆరోపణ..ఇదే అంశంపై అప్పట్లోనే ఏసిబి కోర్టు కొణిజేటి రోశయ్యకు నోటీసులు ఇవ్వగా..దానిని హైకోర్టు కొట్టేసింది..హైకోర్టు తీర్పుపైనా మోహన్ లాల్ సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఈ పిటీషన్ ఇప్పటిది కాదు..2016 ఫిబ్రవరిలోనిది..దానిపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు అర్హమైనదిగా భావించి..ఫుల్ ప్లెడ్జ్‌డ్ గా విచారణ చేస్తామని చెప్పింది. త్రిసభ్య ధర్మాసనం స్వయంగా ఇలాంటి కామెంట్స్ చేయడం రోశయ్య ఫాలోయర్లకి కలవరం కలిగించేదే..గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విషయంలోనూ ఇలానే అయింది..చివరిదశలో కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఒక్కే కేసునుంచి బైటపడిన సంగతి గుర్తుండే ఉంటుంది

Comments