జగన్ ప్రజాసంకల్పం..సాక్షిది మాత్రం నిస్సంకల్పం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో చేస్తోన్న పాదయాత్ర 11 రోజులు పూర్తి చేసుకుంది. జనం మాత్రం ఇరగబడి వస్తున్నారు..సన్నకారు రైతులు..రైతుకూలీలే ఎక్కువగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు(పిక్చర్స్ చూడండి) ఓవేళ వీళ్లంతా పార్టీ అభిమానులే అనుకున్నా నష్టంలేదు.ఇంతమంది పార్టీ ఫాలోయర్లు ఉన్నారంటే అదీ గొప్పే! జనమేజనం అన్నట్లుగా సాగుతోన్న ఈ పాదయాత్రకి మైలేజీ మాత్రం రావడం  లేదు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య, నమస్తే తెలంగాణ( ఇది కూడా కవర్ చేస్తుంది)లో కనీసం ఓ మూలన కూడా రావడం లేదు..ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా కవర్ చేస్తున్నాయ్..

ప్రతిపక్షనేత చేస్తోన్న యాత్రకి ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు..కానీ..అతను తిరుగుతున్న ప్రాంతంలో సమస్యలు ఖచ్చితంగా వేలెత్తి చూపుతున్నప్పుడైనా..వాటి గురించి రాయాల్సిందే..ఎవరేం పనిగట్టుకుని భజన చేయక్కర్లేదు..అలానే గ్లోరిఫై చేయక్కర్లేదు..

ఐతే ఇక్కడ సాక్షి పత్రిక తీరు కూడా నిఝ్జంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం జగన్ డైరీ అంటూ ఓ కాలమ్ మెయిన్ టైన్ చేయడంతోనే సరిపెట్టుకుంటోంది..నవంబర్ 18 పేపర్ చూస్తే..అసలు యాత్ర జరుగుతుందా లేదా అనే డౌట్ రాకమానదు..ఎందుకంటే..ఏ ఒక్క  పేజీలోనూ దీనికి సంబందించిన ఏపీ ఎడిషన్‌లో కన్పించలేదు( correct me if am wrong). అదే చంద్రబాబు  కానీ లోకేష్ కానీ..సిటీలో కేసీఆర్ కానీ..కేటీఆర్ కానీ ఏదైనా ఈవెంట్‌లో పాల్హొంటే వంధిమాగధుల పత్రికలు ఎలా కవర్ చేస్తాయో తెలుసు కదా..ఐనా కనీసం సాక్షి ఎడిటోరియల్ బ్యాచ్‌కి  ఈ మాత్రం బుద్ది కూడా లేదా..! లేకపోతే వాళ్ల చేతులు కూడా ఎవరైనా కట్టేశారా..బైట చూసే జనం మాత్రం సాక్షి అంటేనే జగన్..జగన్ అంటేనే సాక్షి అన్నట్లు చెప్పుకుంటారు..కానీ డీప్‌గా వెళ్తే ఓరకంగా సాక్షి జగన్ కి సాయం చేయకపోగా...ఇలా నెగటివ్ పబ్లిసిటీకే ఉపయోగపడుతుందేమో అన్పిస్తోంది..అందుకేనా..జగన్ అప్పుడప్పుడూ నాకేం పత్రికలు లేవు..ఛానళ్లు లేవు అంటుంటాడు..ఇది నిజమేనా! ఐనా జగన్ ఇంకా మారాలి..జనం తన వెంట ఉంటే చాలు ఛానళ్లు..పేపర్లు వాటంతట అవే రాస్తాయి చూపిస్తాయనుకోకుండా..కనీసం వారం చివర్లో ఓ సభలా ఏర్పాటు చేసి..ప్యాకేజీలు మాట్లాడుకోవాలి..అప్పుడే అన్ని పేపర్లు..ఛానళ్లు కవర్ చేస్తాయ్..ఇందులో ఎటువంటి దాపరికమూ లేదు..మరి ఈ దిశగా జగన్ పిఆర్ టీమ్ ఎందుకు ఆలోచించడం లేదో

Comments