ఇప్పుడు కోటీశ్వరుడు కావడం చాలా ఈజీ ఆరున్నరలక్షలు పెడితే చాలట


ఇది విన్నారా...సరిగ్గా ఏడాది కూడా పూర్తి కాకుండానే ఓ పెట్టుబడి 900శాతం పెరిగింది. అదే బిట్ కాయిన్ ఇప్పుడు దాని వేల్యూ రూ.6,50,000..నేను మొదటి స్టోరీ రాయడం మొదలెట్టినప్పుడు దాని వేల్యూ ఎంతో తెలుసా రూ.6500..ఇది ఇంతటితో ఆగదట.. మైక్ నోవోగ్రాట్జ్ అనే మాజీ ఫండ్ మేనేజర్ ఇది ఏకంగా 5లక్షల డాలర్లకి కూడా పెరుగుతుందంటున్నాడు..అంటే ఎన్ని కోట్లకి పెరుగుతుందో అంచనా వేయండి..ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్దాం

బిట్‌కాయిన్  స్మాల్ ట్రేడింగ్ ప్లాట్‌పామ్స్‌పై ఎక్సేంజ్వేల్యూ పదివేల డాలర్లపైనే ట్రేడైంది. దీంతో ఎదురు చూసిన పదివేల డాలర్ల మార్క్ కూడా అందుకున్నట్లైంది. ఇప్పుడు ఈ దశలో కరెక్షన్ వస్తే, 30శాతం అంటే 3వేల డాలర్లు ఒక్కరోజే పతనమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. 2009లో క్రియేటైన బిట్‌కాయిన్ ఎన్‌క్రిప్షన్ బ్లాక్ చెయిన్ డేటాబేస్ ఆధారంగా ఫండ్ ట్రాన్స్‌ఫర్ వేగంగా జరిగిపోతుంది. రిటైల్ డిమాండ్ ఎంత ఉందో దానికి రెట్టింపు డిమాండ్ ఇన్సిట్యూషనల్స్ నుంచి కూడా వస్తుండటంతో ఈ రేంజ్ ర్యాలీ నడవటానికి ఆస్కారం కలిగింది. సీఈఎక్స్ . ఐవో(cex.io)ఎక్సేంజ్‌లో బిట్‌కాయిన్ వేల్యూ $10234కి కాయిన్‌మార్కెట్‌క్యాప్.కామ్(coinmarketcap.com)లో $10,050కి చేరింది. బిట్‌స్టాంప్‌లో మాత్రం $9876.99ని మాత్రమే చేరింది. 
" ఈ విలువకి చేరడంతో బిట్‌కాయిన్ క్రియేటర్లు, ట్రేడర్లు తాము రూపొందించిన కరెన్సీకి ఓ గొప్పదనం వచ్చినట్లు భావిస్తున్నారు. ఎఁదుకంటే ఇన్ని రోజులూ ఇదో కరెన్సీ కాదు..సక్సెస్ కాదు అన్నవారికి ఈ విలువ ఓ సమాధానంగా భావిస్తున్నారు. ఐతే ఇంత పెరిగినా కూడా బిట్‌కాయిన్ భవిష్యత్తు అగమ్యగోచరమే,సాంకేతికపరంగానూ సమస్యలు ఉన్నాయ్, అలానే ఇతర కాయిన్ల నుంచి కూడా పోటీ పెరుగుతోంది. ఈ దశలో క్రాష్ అయినా కూడా బిట్‌కాయిన్ మంచి లాభాలే తెచ్చినట్లు లెక్క"  అని సోల్ లెడరర్ అంటారు. ఈయన యూఎస్ టెక్నాలజీ సంస్థ లూమియాలో బ్లాక్ చెయిన్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు.
జింబాబ్వేలో అయితే బిట్‌కాయిన్ వేల్యూ మరీ విపరీతంగా పెరిగిపోయింది. $17875కి దీని విలువ చేరిందంటే అక్కడి ఈ క్రిప్టోకరెన్సీ క్రేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సౌత్‌కొరియాలో బిట్‌థంప్ ఎక్సేంజ్‌లో  $11000 వద్ద, కార్బిట్‌లో 11734డాలర్లకు, కాయిన్‌వన్‌లో 11700డాలర్లకు బిట్‌కాయిన్ వేల్యూ చేరింది. సీఎంఈ గ్రూప్ ఇన్క్, చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్సేంజ్‌లలో త్వరలో  బిట్‌కాయిన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా లాంఛ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఈ
నెలలోనే జరిగిన రాయిటర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్‌లో మైక్ నోవోగ్రాట్జ్ అనే ఫండ్ మేనేజర్ త్వరలోనే మెయిన్ స్ట్రీమ్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా బిట్‌కాయిన్ కరెన్సీని అడాప్ట్ చేసుకోబోతున్నట్లు చెప్పడం గమనార్హం. దీంతో రానున్న రోజుల్లోనూ బిట్‌కాయిన్ వేల్యూ పెరిగే అవకాశాలే ఎక్కువ కన్పిస్తున్నాయ్. ఐతే రిస్క్ మాత్రం భారీగానే ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం

Comments