మంచు మనోజ్ నీ బాధ సరైందే..మరి నీ మ్యూజిక్ డైరక్టర్ సంగతేంటి!


మంచు మనోజ్ ఖచ్చితంగా తన సినిమా రిలీజ్ ముందు..తన ఆవేదన(?) వెళ్లగక్కాడు.ఆయన సినిమాని రిలీజ్ కాకుండా చేస్తున్నారంటూ ఓ ఫ్యామిలీపై మండిపడ్డాడు. అసలు చిన్నోళ్లని అణగదొక్కితే తిరుగుబాటు..తీవ్రవాదం అంటూ  అర్ధం పర్ధం లేకుండా ఏదేదో మాట్లాడేసాడు..దీనికంటే కుండబద్దలు కొట్టినట్లుగా ఎవరు అతగాడి సినిమాని అడ్డుకున్నారో చెప్తే బావుండేది..పైగా అసలు సిినిమాలే వదిలేస్తానంటూ బెదిరించాడు కూడా..! బాబూ ఆ పని చేయ్ నీకు పుణ్యం ఉంటుందనేవాళ్లూ ఉన్నారు..ఐతే ఆయన డబ్బులు ఆయనిష్టం చూసేవాళ్లకి నచ్చేంతవరకూ ఆయన తీస్తూనే ఉంటాడు
వీళ్ల అన్న విష్ణుకూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇష్యూలో ఇలానే ప్రత్యేక దేశం చేయాలి..అంటూ ఏదేదో ట్వీట్ చేశాడు. ఆ దెబ్బకి జనం అంతటికీ జ్ఞానోదయం అయింది వీళ్లు మాట్లాడేది జస్ట్ ఫాలో అవ్వాలి కానీ అందులో అర్ధాలు వెతకకూడదని..! మొన్నామధ్య వీళ్ల సిస్టర్ ట్రాఫిక్ జామ్‌లోే ఇరుక్కుని చేసిన ట్వీట్ ఓ లేడీ ఇచ్చిన కౌంటర్ ట్వీట్‌తో ఛానళ్లన్నీ బ్రేకింగులతో హడావుడి చేశాయ్. సరే " ఒక్కడు మిగిలాడు" అనే సినిమా ఇఁడస్ట్రీకి బ్లాక్ బస్టర్‌గా నిలవకుండా ఎవరు కుట్రలు పన్నారో..ఈ సినిమా తర్వాత ఎంతమంది తమ పెట్టేబేడా సర్దుకుంటారో తర్వాత సంగతి కానీ..ఓ విషయం సూటిగా అడుగుతున్నాం..జవాబు చెప్పండి.ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వ్యక్తి..ఎవరు?

అతగాడిని ఎందుకు సైడ్ చేసేశారు..ప్రిరిలీజ్ ఫంక్షన్లో కానీ..ఆడియో ఫంక్షన్లో కానీ అతని ఫోటోలు ఎందుకు పబ్లిష్ చేయలేదు..? దీన్ని ఏమంటారు సర్! తొక్కేయడమా...లొంగుబాటా..అణచివేతనా..లేక ఇంకేటిం
మరి మీ దగ్గరే ఇన్ని తప్పులు పెట్టుకుని..ఇతరులు చేసిన దాన్ని ఏమంటారు..గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరడం కాదా!? ఎనీవే...నీ ఒక్కడు మిగిలాడు నీకు చివరి సినిిమా కాకూడదని , బంపర్ హిట్ కావాలని విష్ చేస్తున్నాం

Comments