ఛ! ఇది నిజమా..! నంది జ్యూరీని తెగ మెచ్చేసుకుంటున్నారట..ఎందుకు బాబూ మా చెవిలో పచ్చపువ్వులు


భేష్..! అనుచరగణం అంటే ఇలా ఉండాలి..బాజాభజంత్రీలంటే ఇలా వాయించాలి. ఇందుకోసమే కదా అధినేత మనకి కోట్లకి కోట్లు కాంట్రాక్టులు కట్టబెట్టేది..ఏదీ ఇలా ఒక్క వ్యాసం లేదంటే పొగిడింపుల వార్త కనబడుతుందా..సాక్షిలో..! ఎంతసేపూ వాళ్లకి నచ్చిందేదో రాసుకుని..జీతాలు బొక్కేయడం తప్ప సాక్షి రాతగాళ్లు ఏనాడైనా జగన్ నిర్ణయాలకు..ఇలాంటి సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చిందా..!

నంది అవార్డుల జ్యూరీ నిర్ణయాలను సినీవర్గాలు బాహాటంగానే ప్రశంసిస్తున్నాయట..అసలు ఇలాంటి ఎంపిక ఎప్పడూ లేదని తెగ  ఆనందబాష్పాలు కార్చుతున్నారట..ఇంకా నయం బాజాభజంత్రీలతో జ్యూరీకి అమరావతిలో పల్లకి మోసి మరీ సన్మానం చేయడానికి ఏర్పాట్లు చేయట్లేదు..దానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ముఖ్యఅతిధిగా..ప్రధానమంత్రి వీడియో సందేశం ఇవ్వడం దాన్ని ప్రపంచం మొత్తం లైవ్ టెలికాస్ట్‌ చేయడం లాంటి ఉపద్రవాలు రావు కదా..!

అంతా ఫలానావాళ్లకే అవార్డులు ఇచ్చుకున్నారంటూ విమర్సలు ఏ రేంజ్‌లో వస్తున్నాయో తెలిసే..ఓ పత్రిక పాపం ఆంధ్రులకు కార్తీక జ్యోతి వెలిగించి కళ్లు తెరిపించే తంటాలు పడింది..అర్హులైన వారికి అందలం ఎక్కించారని తెలుగు ఇండస్ట్రీ తెగ కిందామీదా పడుతుందని సదరు వార్త సారాంశం. బాలకృష్ణ హీరోగా ఉండి కూడా సమకాలీన హీరో అయిన చిరంజీవికి అవార్డు ఎంపిక చేయడం ఎంత గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చిందా కథనం..అంటే ఇన్‌డైరక్ట్‌గా బాలకృష్ణ అనే క్యారెక్టర్ ఇంకో హీరోలని పడనివ్వడు అనే విషయాన్ని నిర్ధారిస్తుందా ఆ స్టోరీ..లేకపోతే అదేదో వాళ్ల బాబుగాడి సొమ్ములా..ఇంకో హీరోకి ప్రకటించం మేమే ఇచ్చుకుంటాం అనే స్వేచ్ఛ ఏమైనా ఉందా..నంది అవార్డులు కూడా ప్రజల సొమ్మే..ప్రతి ప్రభుత్వ కార్యక్రమం జనం పన్నులతో చేసేదే..కాబట్టి..ఎవరో ఏదో ఉదాత్తంగా దానం చేసినట్లు బిల్డప్ ఇవ్వొద్దు..కావాలంటే బాలకృష్ణ గారు కానీ..నందమూరి ఫ్యామిలీ కానీ..వారి తండ్రిగారి పేరిట పెట్టిన అవార్డుని ఏకబిగిన..ప్రతి సంవత్సరం ఎందుకు ప్రకటించలేదు..ఎందుకు మూడు నాలుగేళ్లకోసారి అనౌన్స్ చేస్తున్నారు..? అసలు నందుల కంటే..ప్రతి ఏటా టిఎస్సార్(సుబ్బడు), జివిఆర్ ఆరాధన అవార్డులు నయం అన్పిస్తుంటాయ్..ఎందుకంటే..ఎవరినీ డిజప్పాయింట్ చేయకుండా..ప్రతి ఒక్కళ్లకీ ఓ కేటగరీ సృష్టించి మరీ పురస్కారాలు ప్రదానం చేస్తుంటారు. ఓ వైపు ఆల్రెడీ గుణశేఖర్ తెగ సెటైర్లేస్తున్నాడు..దానికి సమాధానం చెప్పండి సర్..సరే ఇంతకీ ఆ బాజాభేజీ..భజంత్రీ  కథనం కింద ఫోటోలో ఉంది చూసి తరించండి

Comments

Post a Comment