పేలిన జగన్..మరి బుల్లెట్ ఎవరికి దిగుతుంది?


వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపి సిఎం చంద్రబాబునాయుడికి సవాల్ విసిరారు. దమ్ముంటే నాపై మీరు చేసిన ఆరోపణలు రుజువు చేయండి. దానికోసం 15 రోజులు గడువిస్తున్నా.!..నాకు ఆస్తులు విదేశాల్లో ఉంటే రాజకీయాలకు గుడ్‌బై చెప్తానంటూ ఛాలెంజ్ చేశారు. ఇది మరి చంద్రబాబుకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లేగా ..!

దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే పారడైజ్ పేపర్స్ అంటూ కొన్ని లీకుల డాక్యుమెంట్లు రిలీజ్ అవడం..వాటిని ఈనాడు భారీగా తనకే సాధ్యమైన శైలిలో రాతలు రాయడం..
ఆ వెంటనే చంద్రబాబుగారు " వైఎస్ జగన్ పేరు వాటిలో ఉంది..ఇదీ ఆయన అవినీతి " అంటూ తన ఇన్‌డైరక్ట్  కామెంట్స్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయ్.

అసలు  ఈ ప్రహసనం అంతా చూస్తే, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా..అందులో జగన్ పాత్ర ఉండే తీరుతుందంటూ ఓ రకమైన ఫోబియా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది టిడిపి బ్యాచ్..దానికి తగ్గట్లే ఇంటర్నేషనల్ జర్నలిస్ట్స్ అంటూ ఓ సంఘం హఠాత్తుగా కొన్ని డాక్యుమెంట్లు రిలీజ్ చేయడం అప్పటికప్పుడు కేంద్రం వీటిపై విచారణా కమిటీలు ఏర్పాటు చేయడం కూడా ఓ ఫార్సులానే కన్పిస్తుంటుంది..అప్పట్లో ఫోనెక్సా..పనామా పేపర్లంటూ ఇలానే జరిగింది..అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ ఏం చేసిందో..తేల్చిందో ఎవరికీ తెలీదు..ఇప్పుడు ప్యారడైజ్ వంతు వచ్చింది అంతకు ముందు డీమానిటైజేషన్ టైమ్‌లోనూ జగన్ కి జ్వరం వచ్చింది ఆస్పత్రిలో అందుకే చేరాడంటూ ఏపీ మంత్రులు హేళన చేసారు..ఆ తర్వాత  ఇన్వాలంటరీ డిస్ క్లోజర్ స్కీమ్(ఐడిఎస్-2) కింద ఎవడో పదివేల కోట్లరూపాయలకి దాఖలు చేశాడంటే..అది జగన్ అంటూ ఇన్ డైరక్ట్ కామెంట్స్ సాక్షాత్తూ చంద్రబాబే చేశారు..ఆ తర్వాత వాడో పూజల పిచ్చోడని..కనీసం పదివేల రూపాయల పన్ను కట్టే ఆదాయం కూడా లేదని తేల్చేశారు.చివరికి అతగాడు పరమపదించడం కూడా చూశాం.


ఈ ఇన్సిడెంట్లన్నీ చూసిన తర్వాత జనంలో మాత్రం ఇలాంటి రొటీన్ డైలాగ్స్ వినీవినీ విసుగు పుట్టడం ఖాయం. నడిచినన్నాళ్లూ నడుస్తుంది కానీ.. ఇలాంటి ఆధారాలు లేని కామెంట్లు చేస్తే ఏదోక రోజు రివర్సవడం ఖాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలవోకగా చంద్రబాబునాయుడికి సంధించిన ఈ అస్త్రం ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి..ఈ రకమైన సవాలుతో చంద్రబాబుకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే అనుకోవాలి." ఇలాంటి ప్రతిపక్షనేత ఇంతవరకూ చూడలేదు , ఇంత దుర్మార్గపు నేతని చూడలేదు..రాష్ట్రం దౌర్భాగ్యం" లాంటి కామెంట్లు ఎడాపెడా వాడి పారేసే టిడిపి లీడర్లు ఈ ఆరోపణలు నిరూపిస్తే వారు కోరుకున్నది జరిగిపోతుంది కదా..!.

Comments