తిరుగులేని సూపర్‌స్టార్..కృష్ణ కరువు తీరా అవార్డులు..ఇది మహేష్‌బాబు దండయాత్రే


సూపర్ స్టార్ అంటే తెలుగువారి వరకూ కృష్ణే గుర్తొస్తారు. ఐతే ఆయన తరం దాదాపుగా ముగిసిపోయింది..ఇక ఆయన అసలు సిసలు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ దుమ్ము దులుపుతున్నాడు. తక్కువ కెరీర్లోనే 8 నంది పురస్కారాలు దక్కించుకున్నాడు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కి ఉత్తమనటుడిగా ప్రభుత్వాలు ఏనాడూ పురస్కారాలు అందించిన పాపాన పోలేదు.. ఆయనా లాబీయింగ్ చేసింది లేదు. అల్లూరి సీతారామరాజు, ప్రజానాయకుడు వంటి సినిమాలకు స్వర్ణనంది, తృతీయ నందులు వచ్చినా..కథానాయకుడికి నంది ఇవ్వడమనేది అప్పట్లో లేదు. ఆ తర్వాతే ఆ కేటగరీ కూడా వచ్చి చేరింది. ఐతేనేం కోట్లాది అభిమానులకు కృష్ణ అంటే ఓ దైవంతో సమానమంటే అతిశయాక్తి కాదు. 

జేమ్స్ బాండ్,  డిటెక్టివ్, స్పై, క్రైం, ఫ్యామిలీ, గ్రామీణ ప్రాంతనేపధ్యం, కాలేజీ కుర్రాడిగా, విప్లవ నాయకుడిగా ఆయన చేయని పాత్ర లేదు..జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అన్నట్లుగా..ఆయనకి అవార్డులు రాకపోయినా..ఏనాడూ ఎవరూ ఫీలవలేదు.

ఇక ప్రస్తుతానికి వస్తే..సూపర్ స్టార్ మహేష్..ఆరంభం నుంచే కేక పుట్టిస్తూ..నందుల పంట తన ఇంట పండిస్తున్నాడు..రాజకుమారుడికి స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్నాడు..ఐతే అలా ప్రకటించి కూడా..చివరికి ఆయన పేరు లేకుండా చేశారు..ఐతే ఆ తర్వాత మురారి, టక్కరిదొంగ(జ్యూరీ), నిజం, ఒక్కడు,  అతడు. అర్జున్..దూకుడు ఇలా నందులు నడిచొచ్చేశాయ్..అప్పట్లోనే కృష్ణకి రావాల్సినవి..మహేష్‌కి రావాల్సినవి అన్నట్లుగా అవార్డుల పంట  పడింది..కాస్త గ్యాప్‌తో ఇప్పుడు మహేష్‌కి  శ్రీమంతుడి రూపంలో మరో పురస్కారం దక్కింది..ఇవేవీ ఆయన సినిమాల్లో ఎక్కడా నరక్కున్నందుకో...తొడగొట్టినందుకో దక్కినవో కాకుండా రెస్పెక్టబుల్ పెర్ఫామెన్స్‌కి దక్కినవే కావడం విశేషం..ఇంకా మహేష్ ముందు  బోలెడంత కెరీర్ ఉంది. కనీసం ఇంకో 4 నందులైనా నటశేఖరుని ఇంట్లో వచ్చి చేరతాయని ఫ్యాన్స్ అంచనా.


అప్పుడెప్పుడో శోభన్‌బాబుకి ఐదారు ఫిల్మ్‌ఫేర్లు..నలభై ఉత్తమమహిళా చిత్ర కథానాయకుడిగా  అనేక అవార్డులు దక్కాయంటారు..ఇప్పుడా  రికార్డుని నందులతోనే మహేష్ బీట్ చేస్తాడేమో..పేరులోనే ఈశ్వరుడున్నందుకే ఇలా నందులు వస్తున్నాయేమో అని కొంతమంది సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు కూడా! ఎనీ వే త్రీ ఛీర్స్ టూ మహేష్..!

(pic creditswith manamahesh and other krishna,mahesh fans )

Comments

Post a Comment