ఇక చాలు ఆపు బాబూ సిగ్గు సిగ్గు..! ఇదే మీకూ వైఎస్సార్‌కీ తేడా


మాటలు చెప్పడంలో...కోటలు కట్టడంలో కొందరు లీడర్లు మామూలుగా కాదు..ఆరితేరిపోయి ఉంటారు..ఇలాంటి వాళ్లగురించిఎంత చెప్పినా తక్కువే! కళ్లు ఆర్పకుండా అబద్దాలు ఆడటంలో ఘనాపాటి అంటుంటారు..ఇలాంటి విషయంలో ఈ వ్యక్తి గురించి అప్పటి జననేత వైఎస్సార్ రకరకాల పంచ్‌లు వేసి బొోలెడంత ఉల్లాసాన్ని పంచేవారు..పొలిటికల్ లీడర్లలో కూడా ఇంత సునిశిత హాస్యం..ఇంత దూరదృష్టి..పరిశీలనా థృక్పథం ఉన్నాయా అన్పించకమానదు రాజశేఖర్ రెడ్డిని చూస్తే..! ఆయన గురించిన కథలు వినడమే తప్ప నిజాలు మనకి తెలీవు కదా..కానీ యెల్లో బాసులు ఇప్పుడు రాస్తున్న కథనాలు చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వైఎస్సార్‌పై ఉన్నవన్నీ అపోహలే అనడంలో సందేహమే రాదు.
ఎందుకంటే..హైదరాబాద్‌ మెట్రో మా చలవే అని ఎంత నిర్లజ్జగా..నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారంటే..ఛ జనానికి మెదడు ఉంటుందని..అందులో గుజ్జు కూడా ఉఁటుందని కొంత కూడా గౌరవం ఇవ్వని ఈ నేతలను చూస్తే అసహ్యం వేయకతప్పదు..పైగా ఆయనగారికి ఆహ్వానం ఉన్నా లేకపోయినా...హైదరాబాద్‌ని డెవలప్ చేసిన సంతృప్తి మాత్రం ఆయనకి ఉంటుందట.

.ఈ లెక్కన జలయజ్ఞం పేరుతో ఏకబిగిన 52 ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన వైఎస్సార్ ఏమవ్వాలి..ఝంఝావతి, సీలేరు, చిత్రావతి, పోలవరం, వెలుగోడు, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, పోచంపాడు,..ఇప్పుడు కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం (అప్పటి పేరు ప్రాణహిత చేవెళ్ల..) ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రాజెక్టులకు ప్రాణం వచ్చాయ్..వాటిలో పోలవరం కడితే జీవప్రాణులు అంతరించిపోతాయ్..జనం అల్లాడతారు..పాపికొండలు కనబడవు అంటూ ఎన్ని ధారావాహికలు ఓ పత్రికలో ప్రవహించాయి..అలాంటి పోలవరం ఇప్పుడు జీవదాయిని..ప్రాణదాయిని అయిందా...ఇవన్నీ అడగాలనిపించదా..( అడిగినందుకు  ఓపార్టీకి అభిమానం అంటగడితే అంతకన్నా పాపం వేరే ఉఁడదు) అసలు జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ ఎవరి హయాంలో కట్టారు..దానికి రాజీవ్ గాంధీ పేరు పెడితే...లేదు లేదు ఎన్టీఆర్ పేరే ఉండాలని గొడవ చేయలేదా...అది ఎవరి హయాంలో కట్టినట్లు మరి..అలానే ఔటర్ రింగ్ రోడ్డు కట్టబట్టే కదా..ఈనాడుకి కడుపు మండింది..ఆతర్వాత మార్గదర్శిపై ఉండవల్లి అస్త్రాలు బైటికి తీసింది..అలాంటి మూడు ప్రాజెక్టులు అప్పనంగా ఎవడో ఒకడి ఖాతాలో క్రెడిట్ వేసుకుంటామంటే జనం అంత పిచ్చోళ్లు కాదు బాబూ..!

శిలాఫలకాలు..కన్పించేవి..మనోఫలకాలపై ఉండే పేరు వేరే ఉఁటుంది..అంతెందుకు నాగార్జున సాగర్ ఎవరి హయాంలో పూర్తైతే..అది వారే కట్టారని అనుకుంటున్నారా..ముక్త్యాల రాజా పేరు కనీసం నాలాంటివారికైనా గుర్తుండదా...ఆయన కృషితో కాదా సాగర్ కార్యరూపం దాల్చింది..ఇది చరిత్ర..ఏదో ఊరికే ఇలా నాలుగు బీద పలుకులు మాట్లాడేసి.. సింపతీ కొట్టేద్దామనుకుంటే కుదరదు గురూ...! కాలం మారింది..చరిత్ర మనం చచ్చినా మారదు..పాతిపెట్టినా  ఏదోనాటికి బైటికి చీల్చుకువస్తుంది

అసలు పైన పెట్టిన స్టోరీ ఇంకో పేపర్లో వస్తుందేమో చూడండి..అందుకే ఇలాంటి పేపర్ల సర్క్యులేషన్ బాగా పెరగాలి..వీళ్ల బండారం ఎక్కువమందికి అర్ధమవ్వాలి..అందుకే ఈ వార్త అమరావతిలో మాత్రమే వస్తుంది. అంటే అక్కడి జనం చూసి అబ్బో మా బాబే! ఇక ఇక్కడ కూడా నువ్వే కలకాలం ఉండాలి బాబూ..నువ్వే అన్నీ పూర్తి చేయాలి బాబూ అని కలలు కంటారని వీళ్ల ఫీలింగ్..
రాజశేఖర్ రెడ్డి ఎంతమందిని కలిసినా..ఎలాంటి ప్రముఖులతో మీటింగులు పెట్టినా..అవన్నీ గూగుల్‌లో కన్పించాల్సిందే తప్ప ఎక్కడా ప్రచారమే జరగదు..మచ్చుకి ఈ ఫోటోలు చూడండి



Comments