జగన్‌ని 100మీటర్ల లోతుకి పంపుతాడట! బాబూ ఏంటీ విపరీతధోరణి


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రీసెంట్‌గా వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌పై చురకలు వేసాననుకుని తన స్థాయి తానే దిగజార్చుకుంటున్నారు..ఎందుకంటే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని అటు పవన్ కల్యాణ్ అడిగాడు..ఇటు జగన్ అడుగుతాడు..అంతమాత్రాన అక్కడికేదో ఈయన ఎవరికీ జవాబుదారీ కాదన్నట్లు, వాటిపై సెటైర్లు వేయడం ఎంత మాత్రం సరికాదు..ఓవైపు కేంద్రం స్పిల్‌వే పనులు ఆపేయమని లెటర్ రాసిన సంగతి గుప్పుమనగానే..నానా హైరానా పడుతూ ఢిల్లీకి పోయిన సంగతి అందరూ చూశారు. నితిన్ గడ్కరీ పర్సనాలిటీకి తగని ఓ శాలువా కప్పినంత మాత్రాన ఆయన ఆదేశాలు ఆగిపోవు కదా..

పోలవరం టూర్ చేస్కుంటూ అక్కడ అంత అయింది..ఇక్కడ ఇంత అయింది అనకపోతే..నిజంగా ఎక్కడ ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో ఓపెన్‌గా చెబితే అందులో పరువు పోయేదేముంది..అసలు గత యూపిఎ హయాంలో పోలవరం కేంద్రమే చేపడుతుంది అని హామీ ఇచ్చింది. ఇక్కడ ప్రత్యేకంగా బిజెపి ఉన్నా..కాంగ్రెస్ ఉన్నా ఆ కట్టడం పూర్తి చేయాల్సింది కేంద్రమే..అందులో చంద్రబాబు ఎందుకు వేలు పెట్టాలి..అక్కడికేదో ఆయనే పునాదిరాయి వేసి..పూర్తి చేసిన బిల్డప్ ఇవ్వడానికేనంటూ ఇప్పటికే బోలెడంత విమర్శలు ఉన్నాయ్. వాటికి సమాధానం చెప్పుకోలేక.." జగన్ ని వందమీటర్ల లోతులోకి పంపిస్తే సరి..డయాఫ్రమ్ వాల్ , స్పిల్ వే, ఇలాంటి టెక్నికల్ టర్మ్ నాకే తెలీడం లేదు..ఆయనకేం తెలుస్తాయ్ " అంటూ చులకనగా మాట్లాడటం ఎందుకు..పైగా అదేదో ఘనకార్యంలాగా ఆయన బాకా పత్రికలో హెడ్డింగులు పెట్టుకోవడం కూడా. శ్వేతపత్రానికి బంగారు పూత ఉంటుందా..అంటూ మరో కామెంట్ కూడా బాధ్యతారాహిత్యమే..గతంలో హోదా ఏమైనా సంజీవనా అంటూ ఇలానే ఓ కామెంట్ వాడారు. ఇది ఏపికి సంబంధించిన అంశం ఎవరు ఏమైనా అడిగే హక్కు ఉంటుంది..నువ్ చేయ్ చేయకపో..! జగన్ ఓ ప్రతిపక్షనేత..కేబినెట్ ర్యాంక్ కూడా ఉందాయనకు..అలాంటిది ఆయనకేం రైట్ లేదన్నట్లు మాట్లాడితే ప్రజాభిమానం కోల్పోతారు.

అసలు ఏ హోదాలో రాజమౌళిలాంటి సినిమా జీవులకు రాజధాని నిర్మాణంలో పాత్ర కల్పిస్తారు. ఆయనేమైనా ఇఁజనీరా..లేక పేద్ద కాంట్రాక్టరా..రేపు పోలవరానికి కూడా మంచి డిజైన్ ఇస్తాడేమో కనుక్కోండి బాబూ..అంతేకానీ ప్రజాజీవితంలో విమర్శలను అలవోకగా వేసేస్తే ఏదోక రోజుకి రివర్సవుతాయ్ 

Comments