ఈ ఏటి మేటి ట్వీట్-హ్యాపీ ఎండింగ్ టు 2017


ఏపి కాని తెలంగాణ కానీ ఇంకో రాష్ట్రం కానీ పార్టీ నేతల మధ్య ఎప్పుడూ విమర్శలే చెడుగుడు ఆడుతుంటారు. ఓ రకంగా చూస్తే అసలు నిజంగా కూడా ద్వేషంగా రగులుతుంటారేమో అని చూసే జనంలో చాలామంది భ్రమపడుతుంటారు..పార్టీ నేతల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంటే చూసేవాళ్లు కూడా అలానే హ్యాపీగా ఉంటారు. ఏపీలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుధ్దం చూస్తే ఇలానే అనుకుంటారు కూడా ఐతే వాస్తవానికి చంద్రబాబు , జగన్ అంతర్గతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఉంటారు అని చాల ా కొద్ది మంది అప్పుడప్పుడూ చెప్తుంటారు. ఇఁదులో వాస్తవం ఎంతో తెలీదు కానీ..
ఇవాళ జగన్ బర్త్ డేకి చంద్రబాబు ట్వీట్ చేయడం వైఎస్ జగన్ దానికి రిప్లై ఇవ్వడం చూడముచ్చటగా అన్పిస్తోంది. ఐతే దీనిపై కూడా కుక్కమూతి పిందెల్లా కామెంట్లు చేయడం మన జనం నైజం ఎంత నైచ్యానికి దిగజారిందో అర్ధం అవుతోంది. అసలు ఇద్దరు వ్యక్తుల తరపున సమూహాలుగా విడిపోయి అసహ్యకరమైన కామెంట్లు చేసుకోవడం ఇలాంటి బ్యాచ్‌కే చెల్లింది. 

సినిమా వేరు నిజజీవితం వేరు..రాజకీయాలు వేరు..వ్యక్తిగతాలు వేరు అనే అఁశాలను నేతలు చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా చేసినప్పుడే ఇంత ఘాటుగా వాదించుకోవడం మానతారు. ఇది ఎందుకో మరి మన నేతలు చేయరు..ఐతే వాళ్లు స్నేహపూరితంగా ఉన్నా కూడా వాటికీ ఏదోక మకిలి అంటగట్టుకుని సంతోష పడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్లకే ఇలాంటి ఫ్రెండ్లీ ఇన్సిడెంట్లు నచ్చవు

Comments