ఇలా బాలయ్య మాట్లాడటం ఎప్పుడూ చూసి ఉండరు


అమ్మయ్య నారా లొకేష్ ఏ భాషా రాక్షసాలూ సృష్టించలేదు..ఏ పదసునామీ విరుచుకుపడలేదు..అటు బాలయ్య కూడా బాగానే రంజింప జేశాడు. ఏ ఫ్యాన్‌పై తన ప్రేమ ప్రదర్శించలేదు..చాలు..ఇక అని.. జైసింహా మూవీ  audio రిలీజ్ సందర్భంగా కాస్త ఫ్యాన్స్ అలా ఊపిరి పీల్చుకున్నారొ లేదొ ...వెంటనే పిడుగుల్లా పడ్డాయ్ బాలయ్య డైలాగ్స్..మొదట్లొనే రాష్ట్రపతి జాతీయఅవార్డులపై తొడుదొంగలు, పిచ్చిపుల్లయ్య సినిమాలకు డబ్బులు రాలేదు..2లక్షలు నష్టం వచ్చిందని చెప్తూనే..అవెందుకూ పనికిరావు..కరిగించినా..అఁతకు మించి రావు డబ్బులు అంటూ కాస్త వివాదాస్పద కామెంట్లే చేశాడు బ ాలయ్య.. అది తప్పించుకుని కాస్త ప్రసంగం ముందుకు వెళ్లిన తర్వాత  అల్లుడు నారా లొకేష్‌పై ప్రశంసలు కురిపించేశాడు..అంతకు ముుందు ఆయన కూడా తమ మామను ముద్దుల మావయ్య..నటసింహం..సీమసింహం అఁటూ కాస్త పదాలు వెతుక్కున్నా రాక్షసాలు దొర్లకుండా బాగానే కవర్ చేశాడు..చక్కని ప్రసంగమే చేశాడు..

ఐతే చివర్లొ పాపం బాలయ్య అన్పించకతప్పలేదు. డైలాగులు గుర్తుకురాకపొతే, పక్కనుంచి డైలాగ్ రైటర్ ఎం. రత్నం అంది ఇవ్వడం.. ఫ్యాన్స్ గొడవ చేస్తుంటే " హే ఆపండి..ముందిది వినండి..నా సినిమాల్లొ ప్రతి దాంట్లొ  ఒక సందేశం ఉంటుంది..మీరు వినాలి.." అని గద్దించి మరీ బాలయ్య డైలాగులు చెప్పాల్సి వచ్చింది..ఇది ఒకసారి కాదు..దాదాపు చివర్లొ 3,4 నిమిషాలు ఇదే తంతు. చివరికి ఎలాగొ తన స్పీచ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి నిష్క్రమించాడు.

video చూడండి

మొత్తం మీద బాలయ్య ఊపు ఏ మాత్రం తగ్గలేదనేది ఫంక్షన్ చూసినవాళ్ళకి అన్పించకమానదు. అలానే సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని పదే పదే యూనిట్ మెంబర్లంతా బల్లగుద్ది మరీ చెప్పుకొవడం విశేషం.కాస్తలొ తప్పి పొయింది కానీ..ఇది కూడా ఈ ఏడాదే రిలీజైతే లేటు వయసులొ మూడు సినిమాలు ఒకే ఏడాదిలొ విడుదల చేసిన ఘనత దక్కించుకునేవాడు బాలయ్య

Comments