అడ్డగోలుగా మాట్లాడితే జైలుకి పోతారా..! ఏంటి ఈ కామెంట్ల వెనుక అర్ధం


నిన్న చంద్రబాబు నాయుడు చేతులెత్తేస్తా అనడనం..దండం పెట్టి తప్పుకుంటాం అనడం ఇప్పటికే చర్చకి దారి తీస్తోంటో..బిజెపి ఔట్ డేటెడ్ లీడర్ యడ్లపాటి రఘునాధబాబు చేసిన కామెంట్స్ ఇంకాస్త కలకలం రేపుతున్నాయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు..అసలు అడ్డగోలుగా మాట్లాడితే జైలుకి వెళ్లాల్సివస్తోందంటూ కామెంట్లు చేయడం గమనార్హం..ఇంతకీ ఈయన ఎవరు..ఎప్పుడో 1998లో బిజెపి హవా ఉన్నప్పటి రోజుల్లో గుంటూరు జిల్లాలో బిజెపి తరపున లైమ్ లైట్‌లోకి వచ్చిన లీడర్..ఇప్పుడు సాక్షీ,టివి9 ఇఁటర్వ్యూల్లో దర్శనమిస్తుంటాడు.పార్టీకి అధికార ప్రతినిధికూడా! ఈ బ్యాచ్ అంతా కూడా పురంధీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణల్లా...టిడిపికి యాంటీగా బాంబులు పేలుస్తుంటారు.మరి చంద్రబాబు బిజెపిపై నేరుగా విమర్శలు చేశాడు కదా..ఇంకెందుకు ఊరుకుంటారు ఇలాంటి కామెంట్లతో కాక పుట్టించేశారు..ఇప్పుడు ఈ కామెంట్ల అర్ధం ఏంటి...అసలు కాంట్రాక్టర్‌ని మార్చే ప్రసక్తే లేదని ఎందుకు అంటున్నారు..స్పిల్ వే పనులు ఆపమని కేంద్రం లేఖ రాయడమేంటి?

 దానికి రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఓకే అనాలి..ఎఁదుకంటే అది కేంద్రం కడతామని చెప్పిన ప్రాజెక్టు కాబట్టి...ఓకే..ఓకే...కాంట్రాక్టర్ ఎవరు..రాయపాటి సాంబశివరావ్...కంపెనీ ట్రాన్స్ స్ట్రాయ్...కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే పర్మిషన్ వచ్చింది..అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడాయన..ఇప్పుడు టిడిపిలో ఉన్నాడు..ఐనాచంద్రబాబెందుకు ఆయన్ని మార్చాలంటున్నాడు...ఎఁదుకంటే గురుడు లేట్ చేస్తున్నాడు కాబట్టి( ఇదేనా ఇంకేదైనా మతలబు ఉందేమో ) 

మరి కేంద్రం ఎందుకు మార్చనంటోంది..ఎందుకంటే..కావూరి సాంబశివరావ్ ఇదివరలో కేంద్రమంత్రిగా ఎలా పనులు చక్కబెట్టుకున్నాడో...అలానే రాయపాటికి కూడా ఢిల్లీలో గుడ్ విల్ ఉంది..సో అతగాడు రేపు ఎన్నికలకి ముందు హ్యాపీగా బిజెపిలోకి వెళ్లినా వెళ్తాడు కూడా..! 

ఇవన్నీ ఇప్పటి పాలిటిక్స్..మరి మధ్యలో ఈ జైలుకి పోతావనే హెచ్చరికలు ఏంటి..అంటే ప్రాజెక్టు కట్టడం..దానికి కమీషన్లు...అమ్యామ్యా...వగైరాలు నడిచాయని చాలాసార్లు చాలామంది చించుకున్నారు..ఇప్పుడవన్నీ నిజం కాబట్టే..ఎక్కువగా మాట్లాడితే బొక్కలో పడతారని కామెంట్లు చేస్తున్నారా...? నిజమేనా..ఇదంతా...చూద్దాం  చివరికి ఈ డ్రామా ఎక్కడ ఆగుతుందో..! మరి అప్పటిదాకా  ఏం చేద్దాం..ఇదిగో వీళ్లలాగా మనం కూడా (గోతికాడనక్కల్లా) ఎదురు చూద్దాం


Comments