భేష్ రాజ్యాంగం పని చేస్తుంది వీళ్లపై వేటు పడింది మరి వీళ్లపై వేటెప్పుడు?


ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీకి సేవలు అందించే నాయకులకు ఓ షాక్..జనతాదళ్ యు ఎంపిలు శరద్ యాదవ్, అలీ అన్వర్‌ని ఎంపి పదవుల నుంచి తప్పిస్తూ రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  నిర్ణయం ప్రకటించారు. దీంతో రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జనతాదళ్ యు నుంచి వీరిద్దరి తొలగింపు వెంటనే వర్తిస్తుందంటూ ఆదేశాలు జారీ అయ్యాయ్.వీళ్లిద్దరిలో శరద్ యాదవ్ సభ్యత్వం 2022 వరకూ ఉండగా..అన్వర్‌ పదవీకాలం 2019లో ముగియనుంది. బిజెపితో జట్టు కట్టి ఆ పార్టీ తరపున ప్రచారం చేయడంతో ఆటోమేటిగ్గా వాళ్లే తమ పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నట్లుగా భావించాలనే జెడీయూ వాదనతో రాజ్యసభ చైర్మన్ ఏకీభవిస్తూ ఈ అనర్హత వేటు వేసారు.





ఇది తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిలు, ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా షాక్ కలిగించే పరిణామాలే అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్, టిడిపి నుంచి టిఆర్ఎస్‌కి వైఎస్సార్సీపీ నుంచి టిడిపికి జంప్ కొట్టిన వీరులంతా ఇప్పుడు టెన్షన్ రిలీవ్ కావడానికి ప్రెజర్ బాల్స్ ప్రెస్ చేసుకోవాల్సిందే ఎందుకంటే..ఈపాటికే అటు కాంగ్రెస్, ఇటు వైఎఎస్సార్ కాంగ్రెస్‌లు అటు స్పీకర్‌కి ఇటు స్పీకర్‌కి కంప్లైంట్లు ఇచ్చి ఉన్నారు..తనపై అపవాదు లేకుండా ఉండటానికి వెంకయ్యనాయుడు వెంటనే స్పందించారు..సో ఇక బంతి వీళ్ల కోర్టులోనే ఉంది కాబట్టి, వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే లేదంటే రాజకీయంగా ఎంత డ్యామేజీ జరగాలో..అంతా జరుగుతుంది,
కాకపోతే వాళ్లు రాజ్యసభ ఎంపిలు కాబట్టి డెసిషన్ వెంటనే వచ్చింది..వీళ్లు లోక్ సభ ఎఁపిలు కాబట్టి రాదనే ధీమా వద్దు..ఆ రోజూ వచ్చిందంటే అప్పుడు సీన్ సితార్ అవుతుంది. వైఎస్సార్సీపీ నుంచి ఎంపిలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లిగీత, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక ఇలా మారగా ఎమ్మెల్యేలు  ఓ22మంది జంప్ చేశారు..ఇక టిడిపినుంచి ఎర్రబెల్లి, తలసాని...తదితరులు జంపైన వారిలో ప్రముఖులు మరి వీరందరిపైనా చర్యలు ఎప్పటిలోగా ఉంటాయో చూడాలి

Comments