పోలవరానికి రిజర్వేషన్లతో బ్యాలెన్స్ చేయగలరా?


ఏపి సిఎం చంద్రబాబునాయుడు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. పోలవరంపై కేంద్రం షాక్ ఇవ్వడంతో వెంటనే తేరుకున్నారు. రెండో రోజే బిసిల్లో కాపులను చేర్చుతూ తీర్మానం చేయడం, కేంద్రానికి పంపించామని చెప్పడం ద్వారా పొలిటికల్‌గా డామేజ్‌ని అధిగమించే ప్రయత్నం చేశారు. దీనికి బోనస్‌గా వాల్మీకి,బోయలను కూడా ఎస్టీల్లో చేర్చాలంటూ తీర్మానం చేయడం హైలైట్. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, బిసిల్లో కాపులను చేర్చడమనేది ఇప్పటి అంశం కాదు. కోట్ల విజయభాస్కర‌్  రెడ్డి సిఎఁగా ఉన్న సమయంలోనే ఒంటరి,తెలగ,బలజ కులాలను బీసీల్లో చేర్చారు..కొన్ని జిల్లాల్లో ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కూడా..ఐతే వారు చెప్పే కారణాలు వేరు. ఇప్పుడు ఏకమొత్తంగా కాపు కులాలను అన్నింటినీ వెనకబడ్డారంటూ బిసిల్లో చేర్చాలంటూ మంజునాధ కమిషన్ ఏర్పాటు చేసి మరీ చేర్చే ప్రతిపాదన చేశారు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం అనేది తెలిసిన విషయమే ఎందుకంటే..మంజునాధ కమిషన్ గడువు ఈ మధ్యనే పెంచిన రాష్ట్రప్రభుత్వం..అది నివేదిక  ఇచ్చిందీ లేనిదీ ఏమీ చెప్పకుండానే ఏకవాక్యంలో ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నామని చెప్పడం విడ్డూరం..

అందుకే బిసి సంఘాల్లోనూ దీనికి నిరసనలు బయలుదేరాయ్. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో పడింది. ఓ వేళ కేంద్రం వద్దంటే..మేం ఇచ్చాం కేంద్రానిదే తప్పంటూ టిడిపి చెప్పుకోవచ్చు..ఇంకో గండం ఏమిటంటే,కోర్టులు రిజర్వేషన్లను 50శాతానికి మించి ఇవ్వడాన్ని సమర్ధించవు..బిసిలకు ఇప్పుడున్న రిజర్వేషన్లకి అదనంగా మరో 5శాతం అంటే కోటా మించినట్లే..ఏకమొత్తంగా బిసిల్లో చేర్చితే ఉన్న కులాలకు కోపం..అదనంగా చేర్చితే (ఎఫ్ అనే పేరుతో చేర్చారంటున్నారు) కోర్టులు ఒప్పుకోవు..ఇలాంటి స్ట్రోక్ ఇవ్వడం ద్వారా అటు వైఎస్ జగన్ నిలదీతకు, ముద్రగడ పద్మనాభం హడావుడికి చంద్రబాబు చెక్ చెప్పినట్లే..ఇది ప్రాథమిక అభిప్రాయం

ఇప్పుడు వాల్మీక బోయలను ఎస్టీల్లో చేర్చడమనేది కూడా ఈ బిసి సంఘాల నిరసనలను బ్యాలెన్స్ చేేసేందుకు బాగా పనికి వస్తుంది.  ఎందుకంటే ఈ హామీలు చంద్రబాబు ఎన్నికల సమయంలోనే చెప్పారు కాబట్టి చేశారు..మరి పోలవరం బాధ్యత మాత్రం కేంద్రానిది..అంటే స్థూలంగా చంద్రబాబు తన హామీల అమలుకు కట్టుబడి ఉన్నారనేది అర్ధమయ్యే విషయం..(లోపల ఏది ఉన్నా)..ఐతే ఇవి అమలు కాకపోతే మాత్రం ప్రతిపక్షాలకి మరో  ఆయుదం ఇచ్చినట్లే..అంటే సిన్సియర్‌గా ట్రై చేయకుండా, కావాలనే నీరు గార్చారనే అపనిందకి గురవ్వాల్సి ఉంటుంది

Comments