అన్నిటా పోటీ ఇస్తాం..మరి లేడీసా...మజాకా..?


ఆడదంటే అలుసా...కంట్లో నలుసా...అంటే డైలాగులేస్తా..అడుసు కింద తొక్కేస్తా అంటూ  మోహన్ బాబు సినిమాల్లో ఓ డైలాగుంది..అసలు మేం తలచుకుంటే చేయగల పని ఏముంది అన్నట్లుగా ప్రతిచోటా ఇవాళ్టి రోజున మహిళలు దూసుకుపోతోన్నారు..చివరికి బైక్స్ పై కూడా..! ప్యాంట్ షర్ట్స్‌పై అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ...శారీతో బైక్ రైడింగ్ అంటే అసౌకర్యంగానే ఉంటుంది..కానీ ఈ లేడీ మాత్రం భేషుగ్గా రేసింగ్ చేసేస్తుంది చూడండి పైగా త్రిబుల్ రైడింగ్..

ఇది ఎవరు షూట్ చేశారో కానీ...ఏదో యాడ్ ఫిల్మ్ చేసినట్లుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.. ఐతే కారు లోపలివాళ్ల కామెంట్లని బట్టి ఇది ఎల్బీనగర్ హైవేపై తీసినట్లు దృశ్యాలు కన్పిస్తున్నాయ్..నల్గొండ రూట్‌లో దాబాలు ఆ హడావుడి కూడా బాగానే ఉంది..ఐతే నిజంగా రెగ్యులర్ రైడింగో...లేక ప్రిఫిక్స్‌డ్ కెమెరా షూట్ తెలియాలి..కానీ వీడియో మాత్రం కాస్త ఫన్‌గా ఉంది

Comments


  1. //"అసలు మేం తలచుకుంటే చేయగల పని ఏముంది అన్నట్లుగా ..... "//
    -------
    " .... చేయలేని పని ఏముంది ... " అని ఉండాలనుకుంటాను.

    ReplyDelete

Post a Comment