సాక్షికి ఇదేం తీరు


కుటుంబం మొత్తం చనిపొతే..పత్రికలు స్పందించిన తీరు వాటి వైఖరినే చెప్తుంది. ఒ పత్రిక అనుమానస్పద మరణాలుగా వార్తను అందించగా..సాక్షి మాత్రం అడ్డగొలుగా తీర్పరి పాత్ర పొషించడం నిజంగా అనుమానాస్పదమే. ఎందుకంటే సదరు కుటుంబం కొళ్లఫారమ్‌లొ పని చేస్తుంది. అక్కడ చలిని తట్టుకునేందుకు బొగ్గుల కుంపటిని ఇఁట్లొ పెట్టుకుందట. అందులొంచి వెలువడిని కార్బన్ మొనాక్సైడ్ కుటుంబాన్ని మట్టుబెట్టిందని తేల్చేసింది..పైగా  ఒక ఫొటొలొ 7గురు ఆత్మహత్య చేసుకున్న ఇల్లు అంటూ  వాళ్లవి  సూసైడ్లేనంటూ తీర్పుఇచ్చింది..ఇంత పరస్పర విరుద్దమైన కథనం ఒకటే పేజీలొ ఇవ్వగలిగిన ఘనత మన సాక్షికే దక్కిందనడంలొ సందేహం లేదు

రాజాపేట శివారులొ ఏడుగురు ఇలా నిద్రలొనే ప్రాణాలు పొగొట్టుకున్నారంటే..మొదట ఆ కుటుంబానికి ఉన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులు, ఆ తర్వాత ఇంకేవైనా తగాదాలు..యజమానితొ గొడవలు..ఇలా అన్ని కారణాలూ వెతకాలి కదా.వాటిలొ సహేతుకమైన దిశలొ పొలీసులు దర్యాప్తు చేస్తారు పొస్ట్ మార్టమ్ నివేదికలొ కూడా ఎలా చనిపొయారొ తెలీనప్పుడు అది ఆత్మహత్య ఎలా అవుతుంది..ఎందుకంటే..ఉట్టిగా నిద్రలొనే ప్రాణాలు కొల్పేయరకంగా సూసైడ్ చేసుకొవడమనే( అఁటే పొస్ట్‌మార్టమ్‌ లొ కూడా తెలియకుండా) స్థాయికి ఈ పేదజీవులు ఎదిగారా..?
అందుకే మీడియా ముందు సుద్దులు చెప్పడం మానేయాలి. తీర్పరి పాత్రలను ఆపేయాలి..పొలీసులు ఏదైనా లేట్ చేస్తే ఆ విషయంపై దర్యాప్తు చేయమని ప్రేరేపించాలి కానీ..మాకు మేమే పొస్ట్ మార్టమ్ చేస్తాం..రిపొర్టులిస్తాం అఁటే కుదరదు కదా

Comments