మొడీ..నీకెందుకీ అక్కసు


2019లొ కూడా బిజెపికే మంచి ఎడ్జ్ ఉందని ప్రచారమైతే బాగానే సాగుతుంది..ఐతే కాెంగ్రెస్ కూడా ధీటుగానే జవాబు ఇవ్వగలదని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. నిన్న వచ్చిన బైపొల్ రిజల్ట్స్ కూడా ఆ సంగతే ధృవీకరించాయ్. ఎంతకాదనుకున్నా మొడీకి ప్రస్తుతానికి ఎదురులేదు..కానీ ఆయనగారి నిర్వాకాలు..ఉక్రొషం వెళ్లగక్కే చర్యలు చూస్తుంటే మాత్రం ప్రధాని పదవికి కూడా అధమస్థాయి రాజకీయాలను అంటగట్టారనడంలొ సందేహం లేదు. 
గుజరాత్ ఎన్నికల సందర్భంగా మన్మొహన్ సింగ్ ఆయన హత్యకి సుపారి ఇచ్చారంటూ తెగ సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ పూసేసుకుని కళ్లొత్తుకున్న ఈ హీరొ ఇవాళ మరొ నిర్వాకం వెలగబెట్టారు. ఢిల్లీ నుంచి నొయిడాకి కొత్తగా వేసిన మెట్రొ సర్వీస్ ప్రారంభించారు...సరే ఇందులొ ఏముంది అంటారా..యూపి సిఎం ఆదిత్యనాధ్ కూడా ఆయన పక్కనే ఝెండా ఊపేశారు.. ఇందులొ తప్పేముందు ఆ రాష్ట్ర సిఎం కాబట్టి ఊపారంటారా..మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అవసరం లేదా..
లేదు ఎందుకంటే ఆయన ఆమ్‌ఆద్మీ పార్టీ కాండిడేట్ కదా..హే..ఆ పార్టీ ఏంటి కేజ్రీవాల్ సిఎం కదా అంటారా..మొడీ భజనబృందానికి  ఆయనకి కేజ్రీవాల్ పడదు..కాబట్టి సిఎం అయినా, గిఎం అయినా లెక్క చేయరు..అదేంటీ మరి ప్రొటొకాల్ పట్టించుకొకపొతే ఎలాగంటారా..! అసలు సిఎం కేజ్రీవాలే..నాకెందుకీ పితలాటకం..ఇవాళ క్రిస్‌మస్ ఆ సందడి రొజున కూడా పాలిటిక్స్ ఎందుకు అనవసరంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని హుందాగా తీసుకున్నాడు.
మరిప్పుడు చెప్పండి  ఒ అయ్యరూ నువ్ చెప్పింది నిజమే వొ తొ నీచ్ ఫురుష్ థా( అధమస్థాయి ఆలొచనలు కలిగిన  వ్యక్తే) అందామా..లేక ఇదంతా ఈ లొహ్ పురుష్‌కి తెలియకుండా జరిగిపొయింది అనుకుందామా...

ఎందుకంటే ఇప్పుడీ ఒపెనింగ్ చూసిన జనం..అబ్బొ ఇదంతా మా పిఎం, మా సిఎం చలవతొనే సాధ్యమైందని అనుకుంటారు కదా..అంతేగానీ ఢిల్లీ అనేది  ఒక రాష్ట్రమని..దానికి ఒక సిఎం ఉన్నాడని..ఆయనకీ కాస్త అధికారాలు ఉన్నాయని ఎక్కువమందికి తెలియదు కదా( కవర్ చేస్తారు కదా అలాగున)

Comments