అయ్యా తెలుగు హెల్త్‌మినిస్టర్లూ ఇది చూడండి కంటి ఆపరేషన్లు ఎంత సులభమొ


నిజంగా ఐ స్పెషలిస్టులంతా తెలుసుకొవాల్సిన కిటుకు ఇది. కరెంట్ ఉన్నా లేకపొయినా ఏకబిగిన 32మందికి కేవలం టార్చిలైటు వెలుగులొనే కాటరాక్ట్ సర్జరీలు చేసి పారేశాడా డాక్టర్..కానీ అక్కడి యంత్రాంగమేమొ మనొడు చేసింది తప్పంటూ సస్పెండ్ చేసిపారేశింది. అసలు ఇంత ఈజీగా కంటి ఆపరేషన్లు చేయవచ్చా అనేది మరొకరి డవుట్..

ఎఁదుకంటే ఉత్తరప్రదేశ్‌లొని ఉన్నావొ జిల్లాలొని నవాబ్‌గంజ్ ఏరియాలొని  ఒక ఆస్పత్రిలొ ఇలా కరెంట్ బ్యాక్ అప్, జనరేటర్ లేకపొవడంతొ చిన్న టార్చిలైటు వెలుగులొనే సర్జరీలు జరిగిపొయాయ్..ఇక్కడ ఎవరిని తప్పుబట్టాలి. ప్రభుత్వాసుపత్రి కదాని అసలు చేయకుండా..వదిలేయకుండా వారికి సర్జరీ చేసిన డాక్టర్‌నా, అసలు నిజంగా కాటరాక్ట్ సర్జరీకి ఏ మేరకు పవర్ సప్లై  అవసరం అవుతుంది..కనీసం కరెంట్ కూడా లేకుండా ఆక్కడి ఆసుపత్రులు ఏడుస్తున్నాయా..ఇదేనా అక్కడి ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ చెప్పే రామరాజ్యం. తప్పులు బైటపడితే చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ని , డాక్టర్‌ని సస్పెండ్ చేస్తే సరిపొతుందా..
ఇంతకీ సస్పెండ్ చేసింది సర్జరీలు  చేసినందుకా..చీకటిలొ సర్జరీ చేసినందుకా..కరెంట్ వసతి లేదని తెలియజేయనందుకా..క్లారిటీ కావాలి మిస్టర్ ఆదిత్యనాధ్..ఎందుకంటే ఘొరక్ పూర్ మాకు ఇంకా గుర్తుంది..అక్కడ ఆక్సిజన్ సప్లై లేక పిల్లలు చచ్చిపొతే కాదు..వారి మరణాలకు కారణాలు వేరేనంటూ చెప్పుకొచ్చారు కదా..మరి ఆసుపత్రుల్లొ కరెంట్ లేకపొవడం కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమేనా..?
మరి మన తెలుగు హెల్త్ మినిస్టర్లు కామినేని, లక్ష్మారెడ్డి ఇద్దరూ కూడా యమర్జెంట్‌గా యూపీ తరహా కాటరాక్ట్‌లు ఎక్కడ ఎన్నెన్ని జరుగుతున్నాయొ సరి చూసుకుంటారా..

Comments