ఏం ఖర్మరా బాబూ దాక్కున్నావా...మందెక్కువైందా..!


జబర్దస్త్ కమెడియన్‌గానే ఇతగాడు ఎక్కువ తెలుసు..కానీ ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, నాన్నకు ప్రేమతో..లాంటి సినిమాల్లో కూడా బాగానే కన్పించాడు.నవీన్ ఇతగాడి పేరు రాత్రి యాంటీ డ్రంక్ ఎన్ డ్రైవ్ చేస్తోన్న పోలీసులకుదొరికాడట..కాకపోతే ఏంటి...మందు కొట్టడం నేరం కాదు..కారు నడపడమూ నేరం కాదు...కానీ రెండు కలిసి చేస్తేనే ప్రమాదం...వాళ్లకైతే లేదో కానీ...ఎదుటివాళ్లపైకి దూసుకెళ్తే..అంటే సమాజానికి ప్రమాదం అన్నమాట...అందుకే కనీసం వారాంతంలో అన్నా..ఇలాంటి మందుబాబులకు కాస్త చెక్ పెడదాం అన్నట్లుగా పోలీసులు జూబ్లీహిల్స్, మాదాపూర్ ఏరియాల్లో కాపు కాస్తుంటారు...కొంతమంది దొరుకుతారు...కొంతమంది డ్రైవర్లని తీసుకెళ్తారు కాబట్టి...సేఫ్ గానే బైటపడతారు...
కానీ ఇతగాడు చూడండి..ఏం చేశాడో..అక్కడికేదో ఇతగాడు మందుకొట్టి బైట తెలిస్తే..ప్రాణాలు పోతాయ్ అన్నట్లుగా
కారు కింద దాక్కోబోయాడు...ఆ తర్వాత నానా ఆపసోపాలుూ పడ్డాడు..మామూలుగా దొరికితే ఎంత హడావుడి ఉంటుందో తెలీదు కానీ..ఇలా చేయబట్టే ఇఁకా ఎక్కువ ఫోకస్అయ్యాడు మనోడు..

ఐనా ఈ బ్యాచ్ చేసే హంగామా అంతా థర్టీ ఇయర్స్ ఫృథ్వీ ఎప్పుడో బైటపెట్టేశాడు..అలాంటిది కొత్తగా తేలేది ఏముంది..మనోడి బ్యాచ్  చిందులు మణికొండలోే ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు..అంతమాత్రానికి ఈ దాగుడుమూతలెందుకు భాయ్..ఇఁకాస్త కామెడీ పంచడానికే తప్ప ఇంకోటి కాదు..ఐతే మాత్రం సెలబ్రెటీలకు ఎఁజాయ్ చేసే హక్కు లేదా అంటే...ఉంది బాబూ ఉంది..కానీ మందేసి మదపుటేనుగులా జనంపైకి కార్లు  డ్రైవ్ చేయకపోతే చాలు 

Comments