ఇన్‌ఫ్రా స్టాక్స్‌ల మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్..ఈ 3 లాభాలు పంచుతాయట
జెట్‌ఎయిర్‌వేస్,  జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ స్టాక్స్‌తొ పాటు హెచ్‌సిసి బ్రేక్ అవుట్‌కి తయారుగా ఉన్నట్లుగా మార్కెట్ అనలిస్ట్ కునాల్ బొత్రా అభిప్రాయపడుతున్నారు. అలానే ఇన్‌ఫ్రా థీమ్‌లొని కంపెనీల షేర్లు 30-40శాతం లాభాలు పంచినా  ఆశ్చర్యపొనక్కర్లేదని కూడా చెప్తున్నారాయన. వాటిలొ హిందుస్తాన్ కనస్ట్రక్షన్ స్టాక్ చాలా ఎక్కువ లాభం ఇస్తుందని బలంగా రికమండ్ చేస్తున్నారు.

గత ఏడాది ఇదే సమయాన క్రిస్‌మస్ ఉన్నా డీమానిటైజేషన్ దెబ్బకి భయాల్లొ ఉండగా..ఇవాళ గ్రీడ్(దురాశ)తొ ఇంకా ఎక్కువ లాభం..ఇంకా ఎక్కువ లాభం కావాలనే దశలొ ర్యాలీ బ్రేకవుట్ కొసం మదుపరులు  చూస్తున్నట్లు కన్పిస్తుందని కునాల్ బొత్రా చెప్తున్నారు. నిఫ్టీ 10500 పాయింట్ల మార్క్ దాటిన తీరు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఇచ్చిన సపొర్ట్‌తొ బలంగా కన్పిస్తుంది. ఏదొ ఒక సెక్టార్‌ కాకుండా అన్ని సెక్టార్లూ ర్యాలీ నడిచిన తీరు చూశాం. ఒక కీలక పాయింట్లు దాటిన తర్వాత మరొక మార్క్ వైపు చూడటం పరిపాటిగా మారింది. అఁదుకే షార్ట్ టర్మ్‌లొ ఇప్పుడు 10400 పాయింట్లు సపొర్ట్ లెవల్‌గా మారింది. ఒకప్పుడు ఇదే నిరొధక స్థాయి అయిన సంగతి గమనించవచ్చు.
ఈ దశలొ మంచి స్టాక్స్ అంటే ఇన్ఫ్రా స్టాక్స్ ని చెప్పాలి
హెచ్ సిసి ..ఇప్పటికే మంచి బ్రేక్అవుట్‌కి ఈ స్టాక్ సిధ్దంగా ఉంది. అది రూ.45-44.5 వద్ద మంచి లాభాలు పంచవచ్చు..
ఎన్‌సిసి-నాగార్జున కనస్ట్రక్షన్ సంగతి చూస్తే ఇప్పటికే మంచి అప్‌సైడ్ కనబరచింది.గత కొద్ది నెలలుగా మంచి పునాది ఏర్పరుచుకుంటుంది ఎన్‌సిసి. ఇక ఇదే రంగంలొని చాలా స్టాక్స్ 30-40శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి
జెట్ ఎయిర్‌వేస్: బలమైన డెలివరీ పరిమాణంతొ కొత్త 52వారాల గరిష్టానికి చేరిన ఈ స్టాక్ ని రూ.760 వద్ద కొనుగొలు చేయవచ్చు. రూ.825కి చేరే అవకాశాలున్నాయి. నష్టపరిమిత స్థాయి( స్టాప్ లాస్)ని రూ.725గా పెట్టుకొవాలి.
జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ:  ఇప్పుడిప్పుడే ఈ స్టాక్‌లొ ఆశావహ పరిధిలొకి చేరే ప్రయత్నాలు కన్పిస్తున్నాయి. రూ.88 స్థాయి వద్ద ట్రేడవుతొన్న ఈ కంపెనీ షేరుని షార్ట్ టర్మ్‌లొ రూ.100 వరకూ లక్ష్యంగా చేసుకొవచ్చు. నష్టపరిమితస్థాయిని రూ.84గా నిర్ణయించుకొవాలి.

Comments