ఇతగాడికెందుకు అతి ప్రమోషన్


పేరు మొదటి భాగంలో పదును..తర్వాతి భాగంలో ఇమేజ్ కలగలిపిన ఓ కామన్ మేన్‌కి సెలబ్రెటీ హోదా తయారు చేసిన ఘనత టివి ఛానళ్లదే అని చెప్పాలి. ఓ ఛానల్ లో సినిమా రివ్యూలు చేసుకుంటూ కావాలని వివాదస్పదంగా వ్యవహరిస్తూ పోతోన్న సదరు కత్తికి పదును ఉందనుకుంటున్నాయే తప్ప ఎవరో తయారు చేసిన వ్యూహంలో పడిపోతోన్న సంగతి మిగిలిన ఛానళ్లు పట్టించుకోవడం లేదు

పేరు పొందినవాళ్లపై తనకి తోచిన రీతిలో వ్యాఖ్యలు చేయడం, దానిపై ఎవరైనా చర్చలకు పిలిస్తే పరిగెత్తుకువెళ్లడం అవతలి వారు ఇంకా తీవ్రంగా విమర్శిస్తే. దానికి మళ్లీ కౌంటర్లు వేయడం తప్ప ఇతనికి ఇంకో జీవితం లేదా అని కూడా అనుకోవచ్చు. జీవితంలో ఏదైనా సాదించినవాళ్లు , ఇంకొకరికి తాను ఆచరించిన సత్యాన్ని వివరించగలిగినవాళ్లు, రాజకీయనేతలు, సినిమా తారలకే దానికంతట అదే ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాంటిది నలుగురిపై విమర్శలు చేస్తూ పొట్ట గడుపుకోవడంతో పెద్ద వారైపోరు. అలాంటిది ఏ హోదాలేని జనానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత కల్పిస్తున్నారో తెలీదు.

ప్రతిదానికీ నేనున్నాను నా ఒపీనియన్ అడగండి.ప్రపంచంలో ఏ అంశమైనా సరే నన్ను అడగండి..నేను చెప్తా అన్నట్లు తయారైంది ఇతగాడి తీరు. ఇది అడిగేవాళ్లకి ఉండాలి కదా అనుకోవచ్చు. వాళ్లకేంటి ఏదోటి సెన్సేషన్ కావాలి. .దానికోసం వస్తారు అది కాదు విషయం ఎక్కడా ఏ దశలోనూ ఇది నాకు అవసరమా..అనవసరమా అని ప్రశ్నించుకున్నట్లు కన్పించదు. ఎస్ ..నా ఒపీనియన్ ఇదీ అని చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ
దానికి ప్రచారం కూడా అవసరమా కాదా అనేది కూడా నిర్ణయించుకోవాలి కదా. సాగినంత కాలం బాగానే భ్రమల పల్లకిలో ఊరేగవచ్చు. కానీ పల్లకిని అకస్మాత్తుగా వదిలేస్తే అప్పుడు విరుగుతాయి ఎముకలు..కీళ్లు

Comments