మందు కొట్టనేల..చిక్కనేల..చట్టాలను పట్టించుకోకపోతే ఇలానే ఉంటుంది


తెలుగు టివి షోలలో మగాళ్లెవరైనా ఉన్నారంటే అది ప్రదీప్, రవి తప్ప ఇంకో పేర్లు సడన్ గా గుర్తుకురావంటే అతిశయోక్తి కాదు. అంతగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి ప్రవర్తనపై అందరూ కళ్లు పెడుతుంటారనే విషయం వారికి మాత్రం గుర్తుండదేమో..రవి తాను చేసే షోలలో వ్యాఖ్యానాల ద్వారా విమర్శలు తెచ్చుకోగా..ఆ తరహా వాటికి ప్రదీప్ పెద్దగా దొరకడు. బహుశా అతను చేసే షోలు మంచివి కాకపోయినా..బూతు జోకుల షోలు మాత్రం కాదనుకుంటా

ఐతే పాపం కొత్త ఇంగ్లీష్ ఏడాదిలో మాత్రం అడ్డంగా బుక్కైపోయాడు. 38 పాయింట్లు తాకితేనే వాహనాలు సీజ్ చేయొచ్చని చట్టం ఉంటే..మనోడి పాయింట్లు మాత్రం ఐదురెట్లు ఎక్కువై..అంటే 175 పాయింట్లు దాటి మరీ సిగ్నల్స్ పంపించింది బ్రీత్ అనలైజర్..మరి మనొడు ఏ స్థాయిలో మందు కొట్టి ఉంటాడో చూడండి. ఇప్పుడు సెలెబ్రటీ హోదాతో తప్పించుకుంటాడేమో కానీ మందు కొట్టడంలో మనోడి రేంజ్ మాత్రం అందరికీ తెలిసి పోయింది. ఈ స్థాయిలో తాగి ఊగుతూ బండి నడపకపొతే ఏం రోగం. ఎందుకంటే..ఇలా ఊగుతూ బండి నడిపి ఎదుటివాడిని ఢీ కొడితే తాగాడు కాబట్టి ఇతనికి ఏం జరిగినా చేసిిన తప్పుకు శిక్ష పడిందనుకోవచ్చు..కానీ ఇతగాడి బారిన పడితే అవతలి వారి సంగతేంటో కూడా చూడాలిగా

తర్వాత తీరిగ్గా కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి నేను మందు కొట్టలేదు..మీడియా హడావుడి చేసింది ఇలాంటి కామెంట్లు ఎవడైనా చేయొచ్చు కానీ..సమాజానికి యమకింకరులుగా మారడం మాత్రం సహించరాని నేరం. మనం ఎంత డబ్బు పొసినా పోయే ప్రాణం తీసుకురాలేం. మరి అలాంటప్పుడు ఇలా విచ్చలవిడిగా మందు కొట్టేసి రోడ్లపైకి రావడం నీచమైన విషయమే. ఇందులో పక్షపాతం లేదు. ఇంకోటిలేదు. భవిష్యత్తులో జనం ఇలా చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోయే ఫైన్ పడాలి..అతనికి ఒక్కడికే కాదు..ఎవరు ఇలా చేసినా పడాల్సిందే

Comments

Post a Comment