తిరుమలలో వరాహాల విహారం..ఇలాగైతే ఎలా


ఏడుకొండల స్వామి అంటే భక్తులకు కొంగు బంగారమే. ఎన్ని మెట్లెక్కినా...ఎంత శ్రమతో క్యూలైన్లో ఎదురు చూసినా..ఒక్కనిమిషంపాటు వెంకటేశ్వరస్వామిని దర్శిస్తే చాలు..అన్నీ మర్చిపోతారు. అప్పటిదాకా నానాయాతన పడినా తిరుమల క్యూలైన్లోని ఇబ్బందులను తిట్టుకున్నా..ఆ విగ్రహం దర్శించిన తర్వాత ఇంకేవీ గుర్తుండవ్..వీలైతే మళ్లీ వచ్చేటప్పుడు ప్లాన్‌డ్ గా వచ్చి సాఫీగా దర్శించుకుందాం అనుకుంటారు. ఎంత ఒత్తిడి కూడా దైవదర్శనం తర్వాత మటుమాయమైపోతుంది..దర్శనం తర్వాత లడ్డు  ఆ తర్వాత కాసేపు ఆలయం ఎదుట విశ్రాంతి ఇదీ అక్కడ కన్పించే దృశ్యం. ఐతే దేవాలయం ఎదుట దాదాపుగా ఎవ్వరూ కాళ్లకిచెప్పులు వేసుకుని తిరగరు..ఒకళ్లోఇద్దరో తిరిగినా..బెరుకు బెరుకుగా చూసుకుంటూ వెంటనే ఆలయ పరిసరాలనుంచి తప్పుకుంటారు..మాడవీధులు..ఆలయం ఎదురు కూడా గుడిలో ఉన్న అనుభూతి ఉన్నందునే ఇలా చేస్తుంటారు




ఐతే ఇప్పుడు అలాంటి వీధుల్లో పందుల విహరిస్తున్నాయని ఓ వార్త వస్తోంది..నిజంగా తిరుగుతున్నాయి కూడా..అసలు మామూలు జనానికే ఫ్రీగా తిరగలేనంత రద్దీ ఉన్న ఈ ప్రాంతాల్లోకి ఈ వరాహాలు ఎలా వస్తున్నాయో తెలీదు. టిటిడి సిబ్బంది ( అంటే కింది స్థాయి వాచ్‌మెన్లు సరిగా పట్టించుకోకనే కొండపైనుంచి ఇలా నేరుగా వేయికాళ్లమండపం వరకూ వచ్చాయనే అనుకోవాలి.  రష్ తక్కువగా ఉందని తనిఖీ సిబ్బంది కాస్త వళ్లు వాల్చారో లేక, ఇది నిత్యకృత్యమో తెలీదు కానీ.. అపవిత్రంగా భావించే దృశ్యం ఒకటి కన్పించింది. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉఁడాలంటే ఏం చేయాలో కూడా టిటిడికే తెలియాలి.
దశావతారాల్లో ఒకటిగా భావించే వరాహాన్ని అలానే చూసి పూజించే సంస్కృతి మనకైతే లేదు. గర్భగుడిలో ఉన్న మూర్తినైతే పూజిస్తాం కానీ..ఇలా బైట కన్పిస్తే సహించలేం. అందుకే ఈ దృశ్యం కింది స్థాయి పనివాళ్లలోని నిర్లక్ష్యానికి అలసత్వానికి నిదర్శనంగానే చూద్దాం

Comments