గుజరాత్‌లో ఇప్పుడొస్తుంది మజా


గుజరాత్‌లో బిజెపిని ఎలా ఓడించాలో ఇప్పుడు కాంగ్రెస్ కి తెలిసి వస్తోంది. అంటే ఎలా ప్రచారం చేస్తేనో కాదు. జస్ట్ గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ సీట్లు గెలుచుకుని ఉంటే చాలు..పదవి దక్కని నేతలకు అసమ్మతి గాలం వేస్తే చాలు వెంటనే ప్రభుత్వాన్ని కూలగొట్టడం చాలా ఈజీ అని. ఎందుకంటే గుజరాత్ అసెంబ్లీలో బిజెపి 100కి కాస్త ఎక్కువగా సీట్లు వచ్చాయ్ కాంగ్రెస్ కి 80కి దగ్గర్లో వచ్చాయ్ ఇప్పుడు ఓ పదిమంది జంప్ జిలానీలను ఎగదోస్తే చాలు వెంటనే ప్రభుత్వం పడిపోతుంది. అధికార మార్పిడి జరిగిపోతోంది. ఇదీ అడ్డదారుల్లో అందలం ఎక్కాలనుకునే నేతల ఆలోచన..ఇదే ఆలోచన ఇప్పుడు గుజరాత్‌లో జరుగుతుందేమో అనే సంకేతాలు బైల్దేరాయ్. 

దీనికి ఊతం సాక్షాత్తూ బిజెపి లీడర్ నితిన్ పటేలే ఇస్తున్నారు. ఆయనకి మంచి పోర్ట్ ఫోలియో దక్కలేదని సన్నాయి రాగాలు ప్రారంభిస్తే..ఓ పదిమందిని తీసుకురా సర్కారును పడేద్దాం అంటూ హార్దిక్ పటేల్ పక్కరాగం ఆలపిస్తున్నాడు. ఆ..ఇది మోడీ సొంతరాష్ట్రం ఇక్కడ ఎవరూ ఏం చేయలేరు అని హుంకారాలు వద్దు ఎందుకంటే కాంగ్రెస్ తలచుకుంటే ఇలాంటివి చాలా చేస్తుంది బిజెపి కూడా ఇలాంటి వాటికి దూరమేం కాదు..ఉత్తరాఖండ్, గోవా ఇలాంటి చోట్ల చాలానే హొయలు పోయింది. గవర్నర్ వాళ్లవాడు కాబట్టి రాష్ట్రపతి పాలన విధిస్తాడనే కామెంట్లూ ఉన్నాయ్ ఐతేనేం తక్కువ మెజార్టీ తెచ్చుకుంటే వచ్చి పడే ఉపద్రవాలకు ఇలాంటి ప్రచారాలు నిదర్శనంగా ఉంటాయ్. 

అందుకే ఇప్పుడు గుజరాత్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. చెప్పుకున్న లెక్కలు నిజం అవ్వొచ్చు లేకపోవచ్చు కానీ అవకాశాలని మాత్రం కొట్టిపారేయలేం. రేపో ఎల్లుండో కాంగ్రెస్ దూతలు కనుక
గుజరాత్‌లో పాదం మోపితే ఇంకా వేడి పుట్టొచ్చు

Comments