పవన్ ఓదార్పుకి రెడీ ట్విట్టర్‌లో కాదు..ఈసారి జనంలోకే.! పోరాటం కూడా


ఆయన ఎప్పుడొస్తాడో...ఆయనకే తెలుసు..! పైగా రావడం లేట్ అవ్వొచ్చేమోకానీ..రావడం మాత్రం పక్కా అట..సినిమా సినిమాకి మధ్య గ్యాప్‌లో తనవాళ్ల బాధలు పట్టించుకునే పవన్ కల్యాణ్ ఈసారి అటు విశాఖ..ఇటు విజయవాడలో వివిధ కారణాలతో చనిపోయినవారిని పరామర్శిస్తాడట..విమర్శించేవాళ్లు విమర్శించవచ్చు కానీ..పవన్ కల్యాణ్‌ది పాలిటిక్స్‌లో సెపరేట్ ట్రాక్. కార్యకర్తలు..మీటింగులు..భారీగా ఖర్చు పెట్టడాలు ఇలాంటివేం పెద్దగా కన్పించవ్..చిన్న ట్వీట్ వదులుతాడు అంతే..వెంటనే ఆయన అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా చేరుకుంటాడు. అటు శ్రీకాకుళం కిడ్నీ బాధితులను పరామర్శించి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు..వెంటనే మంత్రివర్గంలోని వాళ్లంతా కిందా మీదా పడి, పవన్ కల్యాణ్ గారు స్పందించి మంచి పని చేశారు..అర్రర్రే ఇంత  బాధపడుతున్నారా వీరు అనుకుంటూ ఓ సైంటిస్టులు..డాక్టర్ల బృందం వచ్చి టూర్ చేసింది..మరి ఎంతమందికి ఎలాంటి ట్రీట్‌మెంట్ అందిందో తెలీదు కానీ ఇప్పుడా స్టోరీలు బాధాపూరిత కథనాలు రావడం మానేశాయ్. 
ఎక్కడైనా బాధితులు కానీ..సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు కాీనీ ఉన్నారంటే వాళ్ల దగ్గరకే లీడర్లు వెళ్లడం పోజులు ఇవ్వడం చూశాం కానీ..పవన్ కల్యాణ్ మాత్రం ఆయన దగ్గరకే పిలిపించుకుని బోలెడంత టైమ్ కూడా సద్వినియోగం చేసుకుంటారు..పాలిటిక్స్‌లో ఇదో స్టైల్..ఫరెగ్జాంపుల్ సిఎం దగ్గరకి బాధితులు వచ్చి ఆర్జీలు ఇస్తారు కానీ సిఎం స్వయంగా వెళ్లి తీసుకోరు కదా..అలాగన్నమాట. పైగా పార్టీ పెట్టినప్పట్నుంచీ ఒకటే మాట..ఏ ఎలక్షన్స్ వచ్చినా పూర్తిగా మేం రంగంలోకి దిగుతాం..అన్ని సీట్లకీ పోటీ చేస్తాం అంటారు..అంతలోనే మాకు అంత శక్తి లేదు..మాకు అంత డబ్బు లేదు అని కాంట్రాడిక్షన్ స్టేట్‌మెంట్లు ఇస్తారు..ఎన్ని చెప్పినా ఆయనగారు మైక్ ముందుకువస్తే అన్ని చానళ్లూ లైవ్ ఇవ్వాల్సిందే..అన్నట్లు స్వయంగా ఆయనే  ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు అదేమైందో మరి అని చూస్తే అందులో పవన్ వీడియోలు బాగానే ఉన్నాయ్.

ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా ఆయన యాత్ర మూడు దశల్లో చేస్తారట..ఒకటి పరిశీలన..రెండోది అధ్యయనం..మూడోది పోరాటమట..అంటే ఈ మూడు దశల మధ్యలో కొన్ని కమిటైన సినిమాలు చేస్తారనే టాక్ ఉంది..అలా విడతలవారీగా తన యాత్రలు పూర్తి చేసుకుని 2019 ఎన్నికలకు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది..మరి ఈ ఛల్ చలోరే చల్..సాంగ్ వినండి ఎంజాయ్ చేయవచ్చు..చెప్పొద్దూ . ..క్రేజ్ ఉన్న హీరో బయట కన్పిస్తే జనం ఊరుకుంటారా...రెచ్చిపోయి మరీ ఆదరిస్తారు..తథ్యం..కానీ వాటి పరమార్ధం మాత్రం అడగొద్దు

(సాంగ్ పూర్తి పాఠం..క్రెడిట్స్  విత్ జనసేన యూట్యూబ్ )

(అన్నా వచ్చాం అన్నా..ఇలా వచ్చే ప్రాణాలు పోతున్నాీయన్నా..మళ్లీ పిలుస్తావేం..ఐనా వస్తాం...మా ఆశలు తీరేదాకా ప్రతి తరంలో ప్రతిసారీ వస్తూనే ఉన్నాం-ఇదీ ఓ నెటిజన్ రిప్లై)
కింద పవన్ కల్యాణ్ రాసిన లేఖ కూడా ఉంది చూడండి

(గత ఎన్నికల్లో టిడిపికి ఓటేయమని చెప్పారు..ఈ పాపాల్లో మీకు బాధ్యత లేదా అని ఎవరో ప్రశ్నించారట...అందుకే విశాఖ, విజయవాడ వెళ్తున్నట్లు చెప్పారు..మరి నిజంగా ప్రభుత్వంలో ఉన్నవారికి ఏ బాధ్యతా లేదా..! ఏమయ్యాయ్ చిత్తూరుజిల్లా ఇసుక లారీ ప్రమాదంపై కమిటీ రిపోర్టు, పుష్కర ప్రమాదంపై కమిటీ, పడవ ప్రమాదంపై కమిటీ రిపోర్టులు...ఇలా కమిటీలతో కాలయాపన ఎందుకు ...మేమేం చేయలేమని సైలెంట్‌గా ఉండొచ్చుగా!- మరో దురభిమాని రిప్లై..కానీ నిజం లేదా అందులో)

Comments