మాగంటి బాబు..ఎలా ఉండేవాడు ఎలా అయిపొయాడు


పార్లమెంట్‌నందు ఎంపిగా మంచి ట్రాక్ రికార్డు ఉంది..సగటున 89శాతం హాజరు, 40 ప్రశ్నలు అడిగిన అనుభవం. మనిషి చూస్తే కన్పించడానికి బొద్దుగా ఉన్నా సున్నితమైన మాటతీరులా ఉంటుంది. మార్చి 5 2009 వరకూ కరడుగట్టిన కాంగ్రెస్ వాదుల్లా కన్పించిన ఈ మాగంటి కుటుంబం ఒక్కసారిగా అప్పటి పరిణామాలతొ టిడిపికి మారిపొయింది. మంత్రి పదవి నుంచి తప్పుకొనండి అనే వైఎస్ ఆజ్ఞతొ ఆయన ఏకంగా పార్టీనుంచే జంపై టిడిపికి జై కొట్టారు.

ఇంకా ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే, మాగంటి సీతారామ్ దాస్ మాగంటి బాబు తాత..పశ్చిమగొదావరి జిల్లా చాటపర్రు నుంచి    మహాత్మాగాంధీ పిలుపు ఇచ్చాడంటూ ఉప్పు సత్యాగ్రహంలొ పాల్గొన్నారు. జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఆయన కుమారుడు మాగంటి రవీంద్రనాధ్. ఈయన అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలొ మంత్రిగా చేశారు. తెలుగు ఇఁడస్ట్రీలొ చిరంజీవి, మురళీమొహన్ వంటి నటులతొ మంచి సినిమాలు తీశారు. వీళ్లకి మాగంటి బాపినీడు, వల్లభనేని జనార్ధన్ కూడా చుట్టాలే.. రవీంద్రనాధ్ చనిపొయిన తర్వాత ఆయన భార్య మాగంటి వరలక్ష్మికి కూడా కాంగ్రెస్ మంత్రిపదవులు కట్టబెట్టింది. వారి పుత్రరత్నమే ఈ మాగంటి బాబు అలియాస్ వెంకటేశ్వరరావ్ .. చూడండి విధి విచిత్రం అలాంటి ఫ్యామిలీనుంచి వచ్చి ఇప్పుడెలాంటి తిప్పలు పడుతున్నారొ..ఎంపి కార్యాలయంలొ పేకాట..అది కూడా ఏడాదిన్నర నుంచి..ఇదీ తాతగారు గాంధీ ఆదర్శాలను ఫాలొ అయితే..మనవడు దాన్ని ఎలా దిగజార్చాడొ తెలిపే వైనం. జూదం ఆడటం నేరమా అంటే మరి నేరమే కదా..ఎవరూ ఆడటం లేదా..అంటే ఆడండి..కానీ ఇలా ఎంపి పదవిలొ ఉన్న వ్యక్తి కార్యాలయంలొనే ఇలా సాగుతుందంటే ఎవరైనా Ok గమ్మునుండవొయ్ అంటారా..

దీనికి ముందు కూడా మన మాగంటి బాబు కొడిపందేల విషయంల కూడా బాగానే హడావుడి చేస్తుంటారు. తీర్పులు సంగతి ఎలా ఉన్నా ఆడే తీరతాం..అని తొడగొట్టడాలూ చేశాడాయన. ఆ తర్వాత రికార్డింగ్ డ్యాన్సర్లతొ కలిసి స్టెప్పులేస్తాడు..పేకాట ఆడతాం గురూ..మమ్మల్ని పట్టుకొవద్దు ఎంజాయ్ చేయనీయండంటాడు..చూస్తుంటే  బేసికల్‌గా మనిషిలొ మంచి ఉత్సాహం కన్పిస్తుంది.



 ఆ సరదా తీరే ఇప్పుడు కొంపముంచేలా ఉందని తాజా డెవలప్‌మెంట్స్ సూచిస్తున్నాయ్. కైకలూరులొని పార్టీ కార్యాలయాన్ని క్లబ్‌గా మార్చడంపై జిల్లా సూపర్నెంట్ ఆఫ్ పొలీస్ సీరియస్ అవడం చూస్తుంటే..ఇక మాగంటి బాబు వివరణ తప్పేలా లేదు.(.కొన్నినెలల క్రితం ఇతగాడి పుత్రరత్నం ఒ లేడీకి మాంచి బూతుల ఎస్ఎంఎస్ పంపితే అది కూడా పెద్ద బ్రేకింగ్ అయింది గుర్తుకుతెచ్చుకొండి)

Comments