మెచ్చుకోకుండ ఉండలేం చంద్రశేఖర్ రావును..మరి మన ఆంధ్రభోజుడి మాట ఏంటి


మాతృభాష మృతభాష అనే మాటలు వినబడటమే ఆవేదన కలిగించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనడం నిజంగా  తెలుగుభాషా ప్రియులందరికీ ఎంతగాన నచ్చే విషయం. అసలు తెలంగాణవాదిగా ప్రత్యేకరాష్ట్రం సాధనల ఆంధ్రావాళ్లంటూ  ఆయన వాడిన పదజాలం ఇప్పటికీ మా మనసుల్ల గుచ్చుతూనే  ఉంటుంది. ఐనా...ప్రస్తుతం ఆయన మనసుల అదేం ఉన్నట్లు కన్పించదు. అయిందేద అయిపాయె..ఉన్నవాళ్లని బ్రహ్మాంండంగా ఆదరిద్దాం అన్న ప్రయత్నం కన్పిస్తుంది..మనసుల ఏదైనా ఉండనీ పైకి మాత్రం తెలుగు జనం. తెలుగు సినీ జనాన్ని ఆయన సన్మానించిన తీరు చూస్తే అప్పట్ల ఆయన అలా అని ఉండకపవును అన్పించకమానదు

మద్రాసుల అంటే..అది తమిళుల పాలన..పరాయి భాష అనే ఫీలింగ్ ఉండవచ్చు..కానీ ఇప్పుడిది తెలుగునేల ఇక్కడ్నుంచి ఆంధ్రప్రదేశ్‌కి సినిమా జనం తరలిపతారు అనేది కల్ల..ఒకవేళ వెళ్తే...సబ్సిడీలు దిగమింగడానికే కానీ..ఇంకదాని ఇంకొకటి కాదు.

తెలుగు భాషపై కేచంద్రశేఖరునికి ఉన్న పట్టు అవకాశం ఉన్న ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు..కానీ మన చంద్రబాబునాయుడి తీరు వేరు. వచ్చీ రాని ఇంగ్లీషుల నొ నొ..వాట్ అయామ్ సేయింగ్ ఈజ్..దే బ్రీఫ్డ్ మీ..దట్ ఈజ్ నాట్ కరెక్ట్..ఇలాంటి పదాలు పడుతుంటాయ్..(ఆయన్ని ఎగతాళి చేయడం మా పని కాదు కానీ నిజం ఇదే కదా) ఆయన భాషత నిమిత్తం లేకుండానే ప్రపంచం చుట్టిరాగల దిట్ట. రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడంల ఆయన కృషిని తప్పుబట్టలేం కూడా..కానీ ఒక్కొక్కరికి ఒక్కొటి సూట్ కాదు అంతే..పొనీ మన తెలుగులొ ఏమైనా చక్కగా అనర్గళంగా..సామెతల సాయంతొ రంజింప జేయగలడా అంటే సందేహమే అందుకే బాబు ప్రసంగాలకు ఎక్కడా జనంల నవ్వులు పూయవు..నిజంగా కేసీఆర్ చెప్పినట్లు ప్రతి స్కూల్, కాలేజీల తెలుగు తప్పనిసరి భాష చేయగలిగితే చాలా గొప్పే..కానీ వాస్తవంల అలా జరుగుతుందా లేదా అనేది కాలమే చెప్తుంది..ఐతే కనీసం ఈపాటి ప ్రయత్నమైనా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నారా అన్నది మాత్రం సందేహమే. ఎంతసేపూ లేనిపొని ఆడంబరాల వాగాడంబరమే కానీ..ఆయన మంత్రివర్గంలొని చాలామందికి తెలుగుభాషలొ నాలుగు బూతులు (తప్పులు అని అర్ధం) మాట్లాడకుండా సంభాషించలేరు

Comments