ఆర్‌కె వర్సెస్ ఆర్కే గెలుపు ఎవరిదో!

వైఎస్సార్సీపీకి జగన్ ఎంత బలమో..టిడిపికి బలమైన మద్దతుదారుల లిస్టు చూస్తే ఈయనగారు ముందుంటారు. ఎందుకంటే, ఆ ఐటెమ్ ఎలా పేలుతుందో తెలీదు..ఎలాంటి ప్రయోజనం వస్తుందో తెలీదు..జస్ట్ జగన్‌పై రాయి వేయడానికి ఓ మాట విసరడానికి పనికొచ్చేది ఏదైనా ఆయన తలుచుకుంటే అరగంట నుంచి గంటవరకూ వాయించి వదలగల సామర్ధ్యం. ఇప్పుడా తెంపరితనమే చివరికి నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ వరకూ వచ్చింది. 

అమ్మ జగనా అంటూ ఓ కథనం అద్భుతమైన రీతిలో రాసుకుంటూ వచ్చారీయన. మోడీని కలిస్తే మా బాసు కలవాలి..లేకపోతే మేమే కలవాలన్న రేంజ్‌లో ప్రవచనాలు..ఉద్భోదలూ సాగాయి. అలా కాదు మా ఇష్టం ప్రతిపక్షపార్టీగా మాకు ఎవరినైనా కలిసే హక్కు ఉందన్నా ఊరుకోలేదు..కానీ జగన్ పార్టీలో మాత్రం ఇలాంటి జగమొండిలకు కొదవా..అందులో గాఠ్టి అడ్వకేట్ ఆళ్ల.రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే రూపంలో ఉండనే ఉన్నాడు..చూస్తూ ఆయనెందుకు ఊరుకుంటాడు ఓ డిఫమేషన్ కేసు వేశాడు..మరి ఈయన తక్కువాయన కాదు కదా..వెంటనే కోర్టుకి నేను రాను పో అన్నాడు..పైగా నేను అసెంబ్లీ జరుగుతుంటే నేనెలా కోర్టుకి రావాలి  అన్నాడు..పాపం న్యాయమూర్తులకు ఇదెక్కడి చోద్యం.మీరేమైనా ఎమ్మెల్యేనా..ఎమ్మెల్సీనా మీరెందుకు కోర్టుకి రారు అంటూ ఝాడించారు ఇతగాడ్ని..అయినా పట్టించుకోలేదు..తీరా ఖచ్చితంగా రావాల్సిందే అన్న సమయానికి హైకోర్టుకి వెళ్లారు..ఐనా కోర్టు పట్టించుకోలేదు..చచ్చినట్లు ముందు కింద కోర్టుకి హాజరు కండి..తర్వాత సంగతి తర్వాత అన్నది..ఐనా మనోడు వినలేదు..ఆ..కోర్టులను గౌరవించాలి..చట్టాలని గౌరవించాలి...న్యాయబద్దంగా నడుచుకోవాలి అలాంటి రాతలన్నీ మిగతవాళ్లకే నాకెందుకు అనుకుంటూ అదీ పట్టించుకోలేదు..
ఫలితం నాన్ బెయిలబుల్ వారంట్..ఐనా ఇలాంటివన్నీ పట్టించుకుంటామా అనుకుంటున్నట్లున్నారు..కానీ అక్కడుంది ఆర్కే..అగ్రిగోల్డ్ కేసు, సదావర్తి కేసు, ఓటుకు నోటు కేసులోనే ప్రభుత్వాలకే ముచ్చెమటలు అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించిన ఉద్దండుడు...ఈసారి ఈ కేసుని అంత సులభంగా ఎలా పోనిస్తాడు..బాబూ బాబూ విను చక్కగా చెప్తే వినలేదు కదా..ఇప్పుడు చట్టం ఎంత కఠినంగా ఉంటుందో చూపించినా చూపించవచ్చు...లేదంటే చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఇంకేమైనా చేయొచ్చు..మొత్తంమీద ఆర్‌కే వర్సెస్ ఆర్కే వ్యవహారం బాగా ఆసక్తి కలిగిస్తుంది కదూ

ఐతే ఈ టోటల్ ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏమిటంటే, ఇంకే ఛానల్ కానీ...పత్రికలు కానీ ఈ న్యూస్ వేయరు..ఎందుకంటే..సాటి జర్నలిస్టు కదా..మరి ఇదే నాన్ బెయిలబుల్ వారంట్ జగన్‌కి వస్తేనో...ఈపాటికి భూమి బద్దలైపోదూ...! 

Comments