ఎల్‌బి శ్రీరామ్‌కి సడన్‌గా ఏమైంది


ఎల్‌బి శ్రీరామ్ చిత్రపరిశ్రమనుంచి బలవంతంగా గెంటివేయబడ్డ వ్యక్తే(ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా)..ఐతే ఎలాంటి క్యారెక్టర్ బడితే అలాంటిది చేయనుంటూ కూడా భీష్మించుకున్నాడంటారు. నాకు వెయిట్ ఉన్న క్యారెక్టర్ లేకపోతే పోనీ..నా సత్తా చూపిస్తానంటూ వెబ్ సిరీస్ చేస్తున్నాడు కూడా !  వాటిలో కొన్ని చాలామందికి బాగా నచ్చుతున్నాయ్. మంచి మాటల రచయితగా కూడా తెలిసిన ఎల్‌బి శ్రీరామ్ ఇప్పుడు అనవసరంగా ఓ కామెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మహాసభలు గొప్పగా నిర్వహించాలని చెప్పడమే అది..తెలంగాణలో జరిగిన ప్రపంచమహాసభల్లో కొంతమందిని సరిగా గుర్తించలేదనేది ఆయన కామెంట్

ఏ సభలు నిర్వహించినా..ఎలాంటి కార్యక్రమమైనా ఖచ్చితంగా అందరికీ గుర్తింపు దక్కదు. అనర్హులకు కూడా గుర్తింపు లభిస్తుంది..అలానే అనర్హలకు లభించదు కూడా..ఇది అధినేత ధృక్కోణం నుంచి చూస్తేనే ఎవరు అర్హులో అనర్హులో అనే విషయం తెలుస్తుంది ఇక్కడ ప్రాతిపదిక వారికి నచ్చడమనేదే..అందుకే ఎల్‌బి శ్రీరామ్‌ది అర్ధం లేని కామెంట్ అంటోంది. ప్రతిభకు ఇక్కడ స్థానం లేదు. అంటే ప్రతిభ లేనివారికి మాత్రమే గుర్తింపు లభిస్తుందని చెప్పడం లేదు. దాంతో పాటు అధినేతల మెప్పూ ముఖ్యమే అని చెప్తోండటమే వ్యాసరచయిత ఉద్దేశం

అసలు ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగంలా..ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు ఉంటాయో లేదో తెలీదు..ఉంటే ఎప్పుడనే సంగతి అసలు తెలీదు. అలాంటప్పుడు బాగా ముందే కూసేసిన ఎల్‌బి శ్రీరామ్ ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలి. విజయవాడలోని ఎక్స్‌రే అనే సంస్థ తెలుగు కవులు, రచయితలకు సత్కారం చేసిన సందర్భంలో ఇలా వ్యాఖ్యానించారు ఎల్‌బి శ్రీరామ్. మరి ఈ వ్యాఖ్యలను ఏపి ప్రభుత్వం సంగతి పక్కనబెడితే, తెలంగాణ నేతలు ఎలా తీసుకుంటారో

Comments