ఇద్దరు మేధావుల అడ్డగోలు వ్యాఖ్యలు


కవులని సంకనేసుకోకపోతే ఏ రాజూ ప్రభవించలేడట, ఏ ప్రభుత్వం గొప్పగా జనంలోకి వెళ్లలేదట. ఇదీ రాత్రి జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఇద్దరు మేధావులు( అనుకుంటున్నారు మరి) తేల్చి చెప్పిన సత్యం. ఒకాయన ఏం చెప్పినా అదే నిజమని చెప్పమంటాడు అవతలి వ్యక్తిని. దాపరికాలెందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రోజూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, జగన్మోహనరెడ్డిని తలుచుకోకపోతే ముద్ద దిగదని ఈ ఇంటర్వ్యూలోనే మరోసారి తేలిపోయింది. 
పైగా ఈయన పృఛ్చకుడు కాబట్టి..ఈయన ఏది అంటే ఇక అదే నిజమని నమ్మమంటాడు. నేననేది ఏమిటంటే, అహ..నే చెప్తోంది అదే..గొడవ ఎక్కడొస్తుందంటే..ఇలాంటి సొల్లు మాటలు కనీసం పాతికసార్లు వినొచ్చు..అవతలి వాడి అభిప్రాయానికి విలువ ఇవ్వడమే కన్పించదు. అక్కడికేదో లోకంలోని ప్రతి వ్యవహారమూ ఆయనకి తెలిసే జరిగినట్లు..తెలియంది జరగనట్లు చెప్పడంలో నిస్సిగ్గుగా వ్యవహరించడంలో దిట్ట...సంబంధం లేని విషయాల్లోకి వైెఎస్, జగన్‌ని లాగడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అడ్డంగా దొరికిపోతుంటాడు..ఐతే వాళ్లిద్దరితో వ్యక్తిగత వైరం ఉంది కాబట్టే ఇలా జర్నలిస్టుల ముసుగులో ఇలాంటి పనులు చేస్తుంటారు కాబట్టి మనం పట్టించుకోనక్కర్లేదు.
ఇదే ఇంటర్వ్యూలో చంద్రబాబు అసలు రోబోలా పని చేస్తున్నాడు..ఆయనకి ఓ సరదా లేదు..ఓ ముచ్చటా లేదు అంటూ ఇన్ డైరక్ట్‌గా ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయడం కూడా ఈ మేధావుల జ్ఞానానికి పరాకాష్ట..

పైగా ఈ .యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అయితే " బొడ్డు కిందకి చీర కట్టిన ఓ అమ్మాయని చూసి భలే ఉంది ఈ అమ్మాయి అనేమైనా అంటాడా" అంటూ తన నైజాన్ని చాటుకున్నాడు..అక్కడికేదో చంద్రబాబు అంతా సన్యసించేసి తెగ కష్టాలు పడుతుంటే మిగిలిన లీడర్లంతా ఆనందడోలికల్లో తేలుతున్నట్లు మాట్లాడుకున్నారీ ఇద్దరు మేధావులు

రాజకీయ నాయకులు రాజకీయ కోణమే తప్ప నైతికత లేదు పట్టించుకోవడం లేదన్నది వీరిద్దరి మరో ఆరోపణ..అక్కడికేదో ఆ  బాధ్యత వారికే కానీ మీడియాకి అక్కర్లేదన్నట్లుగా ఈ మహానుభావుడు నాంపల్లి నాన్ బెయిలబల్ వారంట్ సంగతి మాత్రం పక్కనబెట్టాడు..ఏతావాతా ఈ కథనం లక్ష్యం  ఏమిటంటే ఇంత పట్టుదలగా చిత్తశుధ్దితో సొంతనేతల భజన సాక్షి ఎందుకు చేయలేకపోతోంది అని

Comments