ఉద్యోగాలు లక్షకి తగ్గవ్..మాటపైనే నిలబడే చినబాబు


ఏపి సిఎం చంద్రబాబునాయుడి పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్ నోట ఎప్పుడూ ఏపి అభివృధ్ది, నాదేశం గొప్పదనం వంటి మాటలే వస్తుంటాయ్. ఆ మాటకి వస్తే ఆయన "అసలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడిక్కడ కటిన చర్యలు " తీసుకుంటూ ఉంటారు. ఏదైనా దారుణాలు జరిగితే..వెంటనే రంగంలోకి దిగిపోతారు. "నాన్నగారు చాలా సీరియస్‌గా ఉన్నారని " అధికారులకు ఆదేశాలు ఇస్తారు..ఏ ఉద్యోగాల కల్పనా కార్యక్రమం జరిగినా వెంటనే ఏడాదికి "లక్ష ఉద్యోగాలు ఖాయంగా" వస్తాయని ఊరట కల్పిస్తారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపే మిగిలిన మంత్రులందరూ ఏక కంఠంతో చినబాబు పనితీరు అద్భుతం అమోఘమని రిపోర్టులు ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో..ఎంతమందికి ఉపాధి కలిగిందోకూడా ఎక్కడిక్కడ లెక్కలు గడగడా చెప్పేస్తారాయన. ఏపిటా సదస్సులో కూడా ఈ లెక్కలే చెప్తూ...ఇప్పటికి 194 సంస్థలు వచ్చాయని..వాటి ద్వారా 12985మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. అంటే యావరేజ్‌న 66మందికి జాబ్స్ గ్యారంటీ అన్నమాట.

మరీ లెక్కన ఆయన చెప్పే లక్ష ఉద్యోగాలు ఎప్పటికి రావాలి..ఐతే ఎప్పటికప్పుడు ఈ డెడ్‌లైన్లు మారిపోతుంటాయ్.. పైగా ఒక్కోసారి ఒక్కో లెక్క..కనీసం ఐటీలో ఐదు లక్షల ఉద్యోగాలు అని ఓసారి,  ఈ ఏడాది చివరినాటికి లక్ష ఉద్యోగాలు అని ఓసారి, 2019 చివరికి లక్ష ఉద్యోగాలు అని ఓసారి..ఇలా మారిపోతుంటాయ్..ఐతే వీలైనంతగా తెలుగు యువకులకు ఉపాధి కల్పించాలన్నదే ఆయన ధ్యేయమని..ఇలా దెప్పి పొడవకూడదని..కొంతమంది అభిమానులు రుసరుసలాడుతుంటారు. అదీసంగతి

Comments