రాష్ట్రపతి ముందే ఏపీ పరువు తీసిన సిబ్బంది


ఇదే వార్త ఇఁకేదైనా రాష్ట్రంలొ అయితే ఈపాటికి మంచి బ్రేకింగ్ అయి ఉండేది.జరిగింది ఆంధ్రప్రదేశ్‌లొ కాబట్టి కాస్త అక్కడి ముఖ్యమంత్రి మేనేజ్ చేయగలరు కాబట్టి సరిపొయింది. సాక్షాత్తూ రాష్ట్రపతే స్థానిక అధికారులకు క్లాస్ తీసుకొవడం గత ఐదారేళ్లలొ గుర్తుండగా జరగలేదు.
ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ విజయవాడ వచ్చి ఇండియన్ ఎకనమిక్ అసొసియేషన్ సదస్సు‌లొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగం కొనసాగిస్తుండగా...సడన్‌గా ఆగిపొయారు..ఎందుకంటే
అక్కడ పులిహొర పొట్లాల్లాగా ఫుడ్ ఐటెమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటమే..వాటికొసం  అక్కడికి వచ్చిన వారితొ పాటు ప్రెస్ జనం కూడా ఎగబడటమే వెగటు కలిగించే ఘటన
" ఇదే మన ప్రపంచంలొ జరిగేదీ..జరుగుతుందీ..ఇక్కడ జరుగుతుంది కూడా..కనీసం నేను నా ప్రసంగం ముగించేంత వరకైనా మీ పంపిణీ ఆపండి" అని వలంటీర్లకు స్వయంగా ఆయనే చెప్పాల్సి వచ్చింది. దీంతొ మిగిలినవారు షాక్ తిన్నట్లు చూస్తుండిపొయారు తప్ప ఏం చేయలేకపొయారు. ఎందుకంటే ఉన్నట్లుండి అక్కడ అలాంటి సన్నివేశం
ఎదురవుతుందని ఊహించలేదు. ఐనా లొకల్ అఫిషియల్స్ అయినా ఇలా చీప్‌గా బిహేవ్ చేయొద్దు వచ్చింది రాష్ట్రపతి అని అయినా ముందే జాగ్రత్త పడాల్సింది. ఇప్పుడు ఈ సీన్ అంతా అటు నేషనల్ మీడియాలొ కూడా వచ్చేసింది. దాచాలన్నా ఈ రచ్చ దాగేది కాదు మరి.
video credits to ap 24/7 news channel

Comments