పోలవరం అర్ధమైందా పవన్? ఎవరి చలవో కూడా చెప్తే బావుంటుంది


పోలవరం ప్రాజెక్టుకు ముందుగా షెడ్యూల్‌లో లేకపోయినా పవన్  కల్యాణ్ వెళ్లారట..అక్కడి పనులు అడిగి తెలుసుకున్నారట ..పూర్తైన పనులు కావాల్సిన పనులు తదితర వివరాలు బేరీజు వేశారట..ఇవీ ఇప్పుడు తాజా బ్రేకింగులుగా కొన్ని ఛానళ్ల మోత! అసలు షెడ్యూల్ అనే పదం అధికారికంగా ఏదైనా పదవుల్లో ఉన్నవారికి వాడితే అందంగా ఉంటుంది..ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అభిమానులకు ఆయన దేవుడు కావచ్చు కానీ..చట్టం దృష్టిలో సామాన్యుడు..అదే ఆయన  పదే పదే చెప్తుంటాడు..కానీ మనం వినం కదా..!

సరే ఆ గొడవ వదిలేద్దాం..ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ సైట్ సీయింగ్ అయిన తర్వాత మనోడు చెప్పేది పెద్దగా ఏం ఉండదు..కావాలంటే సరి చూసుకోండి " పోలవరం జీవనాడి..అలాంటి ప్రాజెక్టుని పూర్తి చేయాలి. కేంద్రం సహకరించాలి..అవకతవకలు ఉంటే సరిచేసుకోవాలి..ఏదైనా కేంద్రం సత్వరమే నిధులు విడుదల చేయాలి..అలానే పోలవరం నిర్వాసితులను కలిశా..వారికి అన్యాయం జరగకూడదు.".ఇంతకు మించిన మాటలు ఉండవ్. పదాలు వేరుగా ఉండొచ్చు కానీ...అర్ధం ఇదే ఉంటుంది..ఇక సందర్భశుద్ది లేకుండా ఇద్దరు ముగ్గురిపై విమర్శలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

అసలు  ప్రాజెక్టు సామర్ధ్యం ఎంత..దాంట్లోకి నిల్వ సామర్ధ్యానికి తగ్గ వనరులు ఎలా సమకూరుతాయ్..దానికి ఎస్టిమేషన్లు ఎందుకు పెరిగాయ్...ఎవరు పెంచారు..పెంచడం వలన ఎవరికి ప్రయోజనం..ఇప్పుడు ఎందుకు కేంద్రం దాన్ని ఆపేయమనే స్థితి దాపురించింది అనే ప్రశ్నలు వేయగలిగావా?


అంతేకానీ పోలవరం ఎప్పటి ప్రాజెక్టు..దాన్ని వైఎస్ ఎలా తెరపైకి తెచ్చారు..దాన్ని ప్రతిపాదించినప్పుడు ఈనాడులో అడ్డగోలు స్టోరీలు ఎలా వచ్చాయ్..ఇప్పుడెలా అది రాష్ట్రానికి జీవనాడి అయింది లాంటి అంశాలను తన ప్రసంగంలో చేర్చేంత  ఓపిక, తెలివిడి ఉండవు..ఎంతసేపూ "నేను ఊరుకోను..నే పోరాటం చేస్తా...మనం పోరాడదాం..పిరికివాళ్లలా అది చేయొద్దు..ఇది చేయొద్దు మా సహనం కోల్పోతే ఎలా ఉంటుందో చూపిస్తాం "అని చెప్పడం తప్ప...నిర్దిష్టంగా ఇదీ మేం చేయగలిగిందీ అని చెప్పాలి కదా...ఈ దిశగా సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే దానికి కులం, పార్టీల రంగు పులిమేసి..ఆనందపడటం సహజమైపోయింది.

Comments