జివి నీ పిచ్చగానీ..కులపిచ్చ లేనిదెవరికి


ముగిసిపోయిన అధ్యాయాలకు కులరంగు..పిచ్చ పులుముకోడవంలో మనోళ్లకి మించినవాళ్లు లేరని అంటారు. దానికి తగ్గట్లే ఉంటాయి వాళ్లు చేసే పనులు కూడా. విజయవాడలో ఎప్పుడో 30 ఏళ్లక్రితం ముగిసిపోయిన  చరిత్ర్తని ఇప్పుడు తెరకెక్కించి ఏం సాధిద్ధామని ఇతగాడి తాపత్రయం. కేవలం సిటిపై ఆధిపత్యం కోసం జరిగిన పోరు.. అంతకు మించి అక్కడ ఇంకేం లేదు.(ఉందని వాదించేవాళ్లని వదిలేయండి) అనవసరంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను రెండు కులాలు వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ హీరోయిజం ఆపాదీించిన సంగతి అందరూ అంగీకరించేదే  అందుకే వీధి వీధినా గూండాలకు విగ్రహాలు పెట్టారంటూ ఆ తర్వాత అనేక సినిమాల్లో డైలాగులు కూడా రాయించారు.దీనికి  ఏ హీరో మినహాయింపు కాదు.

ఐతే ఆ వర్గానికి చెందినవారు మాత్రం ఆయన అందరికీ నాయకుడంటూ పొగడ్తలతో ముంచెత్తుకోవడం సహజంగా జరిగేదే..ఐతే ఇవాళ జివి మాత్రం ఏకంగా బాహుబలిని మించిన చరిత్ర, దీన్ని 150 ఎపిసోడ్లు చేస్తామని ప్రకటించడం తొడలు కొట్టడం చూస్తే ఎందుకీ ఓవరాక్షన్ అన్పించకమానదు. ఇదే స్థాయి ఉత్సాహం కనుమరుగైన సాహితీవేత్తలనో..టంగుటూరి ప్రకాశం పంతులు మనవళ్లు, గురజాడ అప్పారావ్ వారసులను ఆదుకోవడంలో చూపిస్తే బావుంటుంది..ఎవరైనా పేరున్నవాళ్లని( మంచిదో, చెడ్డదో అనవసరం) తలుచుకోవడం వాళ్లపై సినిమాలు తీస్తామనడం ఫ్యాషన్ అయిపోయింది. కొత్తగా ఇప్పుడు వాళ్ల గురించి తర్వాతి తరాలకు తెలియాల్సినంతంగా చేసిందేం లేదు. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. ఎందుకంటే తన వర్గానికి..తన వారికి ఏదైనా ముప్పు వచ్చినప్పుడు అవతలి వర్గంపై దాడులు చేయడమనే కాన్సెప్ట్‌లో గ్లోబల్ యుగంలో తర్వాతి తరానికి అందించాల్సిన నీతి  ఏమిటో కూడా చెప్పాలి వీలైతే కనుమరుగైపోయిన శాస్త్రవేత్తలపై వెబ్ సిరీస్ తీయండి..ఇంకా లేదంటే మీ ఊళ్లలో స్కూల్స్‌ని ఉద్దరించండి. ఇంకా లేదంటే వాళ్ల పేరిట పేదపిల్లలకు చదువులు చెప్పించండి అంతేకానీ తంతాం..నరుకుతాం అంటూ రెచ్చగొట్టే ధౌోరణులపై సినిమాలు సీరియల్స్ మానండి

Comments