భేష్! కల్యాణ్‌లో నిజాయితీ కన్పిస్తోంది..ఫ్యాన్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాడా?


పవన్ కల్యాణ్ గుంటూరులో మంచి ప్రసంగమే చేశారు. ఓ రకంగా ఆయన అభిమానులను బాగా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా టిడిపిని ఎందుకు సమర్ధించానంటే అంటూ వివరించిన తీరు భేషుగ్గా ఉంది. ఓ రకంగా తెలుగుదేశం పార్టీ తనపై చేసిన దుష్ప్రచారం గురించి బాగా విశదీకరించి చెప్తూ...అలాంటి పార్టీని ఎఁదుకు సమర్ధించానో చెప్పారు..అన్ని కులాలు కలిసి ఉండాలని కోరుకున్నానని అందుకే అలాంటివి ఉండకూడదనే తనపై చెడు ప్రచారం చేసిన టిడిపిని సపోర్ట్ చేశా అని చెప్పాడు..కాస్త విచిత్రంగా ఉన్నా చాలామందిని టచ్ చేసింది.

కానీ ఇఁత చెప్తూ కూడా జగన్‌పై కామెంట్లు చేయడం ఓ రకంగా పవన్ అపరిపక్వతకి నిదర్శనం.ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోక..ప్రతిపక్షనేతగా గెలిపించమని కోరతాడా..? అందరూ కలిసి ఉండాలని కోరేవాడు..ఇంకో మనిషిని మాత్రం ఎందుకు దూరం పెడతాడు..పైగా అభివృధ్ధి సాధించాలంటే అధికారం ఉండాలా అంటే..ఆ అధికారం ఉండబట్టే కదా..అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడిపించుకోగలుగుతుంది..అంతెందుకు ఫాతిమా కాలేజీ స్టూడెంట్లని కలిశారు కదా...వాళ్లకి న్యాయం చేయమనండి చూద్దాం..స్టూడెంట్ల జోలికి వస్తే తాట తీస్తా అనడం సినిమాటిక్‌..ఎందుకు ఎవరి తాట తీస్తారో ఏమైనా అర్ధం ఉందా పవన్ ? సరే ఇంత మాట్లాడిన పవన్ కల్యాణ్ పార్టీలను మార్చే ఎమ్మెల్యేలపై తన అభిప్రాయం చెప్తే ఇంకా భేషుగ్గా ఉండేది.ఐతే ఓ విషయం మాత్రం క్లియర్..టిడిపి తనకి అవమానం చేసిందని చెప్పడం ద్వారా ఫ్యాన్స్‌కి భవిష్యత్తులో ఏం చేయాలో మానసికంగా సిధ్దం చేసినట్లే

అలానే కేసులు ఉన్నాయి కాబట్టి జగన్‌కి సపోర్ట్ ఇవ్వలేదు ..అంటే ఓ వేళ కేసులు ఎత్తేస్తే ఆయనకి సపోర్ట్ ఇస్తా అనే విధంగాకూడా ప్రిపేర్ చేసినట్లే..ఇంకా అన్నిటికన్నా పెద్ద విషయం...చిరంజీవికి తన పార్టీలోకి లైన్ క్లియర్ చేసినట్లే..చిరంజీవి అమాయకుడనే కలరింగ్ బానే ఇస్తూవచ్చాడు. ఇక ఆయన్ని తన పార్టీలోకి తీసుకువచ్చి రాజ్యసభకి పంపించడమే తరువాయి.అసలు ఈ టూర్ ముఖ్యఉద్దేశం ముందే చెప్పింది  కాకుండా సొంతడబ్బాకే సరిపోయింది ఎందుకంటే..ముందు పడవప్రమాద బాధితులు,  ఆత్మహత్య చేసుకున్న  డ్రెడ్జింగ్ కార్పోరేషన్  ఉద్యోగి  కుటుంబాన్ని పరామర్శించడం..ఇదీ అజెండా..వాళ్లే స్వయంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ చూస్తే మీకు అర్ధం అవుతుంది..  కానీ ఇక్కడ ప్రసంగాలు జరుగుతున్న తీరు చూస్తే..కేవలం వచ్చే ఎన్నికల్లో  మనం పోటీ చేస్తున్నాం అనే ఫీలింగ్  కలిగించడమే అన్పించకమానదు..ఐతేచాలా ప్రసంగాల్లో పవన్ కల్యాణ్ నిజాయితీ కొట్టొచ్చినట్లు కన్పించింది..వేరే ఎవరూ దొరక్క టిడిపిని సపోర్ట్ చేస్తున్నా అనడంలో మాత్రం సందేహం లేకుండా ఆయన అమాయకత్వమే కన్పించింది. నిఝ్జంగా అంత ఆవేదనే ఉంటే..ఏకో నారాయణ అంటూ పోటీ చేసిన జయప్రకాష్ నారాయణకి మద్దతు ఇవ్వొచ్చునే..లేదంటే కమ్యూనిస్టుపార్టీలకైనా ఇవ్వొచ్చునే...అవన్నీ వదిలేసి ఓ కూటమికే మద్దతిచ్చి...ఇప్పుడు ఆప్షన్లు లేవు అంటే ఎలా...పోనీ 2019కి కొత్తగా ఆప్షన్లు ఏమైనా వచ్చాయా...అసలు తానే ఓ ఆప్షన్ కాగల అవకాశాన్ని వదిలేసుకుని..(చాలామంది అమ్మేసుకుని అంటారు) ఇప్పుడు ఊరూరా తిరగడం ఎందుకు బాస్..!

Comments