రాగా వర్సెస్ నమో ..రాహుల్ ముందున్న సవాళ్లు


ఎప్పటికైనా అవ్వాల్సిందే ఇప్పటికి అయింది అన్పించారు రాహుల్ గాంధీ..2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక దెబ్బలు తిన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ రెండు దఫాలు దేశాన్ని పాలించినా..ఈ రాహులుడు మాత్రం అవహేళనలే ఎక్కువ ఎదుర్కొన్నాడు. గత ఎన్నికలకు ముందైతే..సాక్షాత్తూ మోడీనే..ఓ షాజెదా ఉన్నాడు..ఇలా చేతులపైకి చొక్కా లాక్కోవడం తప్ప ఏమీ చేయడంటూ ఎగతాళి చేశారు కూడా..ఐతే ఇప్పటి రాహుల్ వేరు..పూర్తిగా పంథా మారిపోయింది. జనాలను రంజింపజేయడమే కాకుండా..జోకులు పేల్చుతున్నాడు..ఆయన అడిగే ప్రశ్నలకు పాపం బిజెపి జనాలకు పాత సెటైర్లు తీసి వేయడం తప్ప ఇంకేదీ దొరకడం లేదు. ఐనంత మాత్రాన ఇక రాహుల్ గాంధీ హిందోళ రాగం పాడేసినట్లేనా అంటే...కాదు..చాలా సవాళ్లు ఉన్నాయ్.ఐతే ఇలా అధ్యక్షపదవి స్వీకరించడం ద్వారా పాత విమర్శకి నేరుగా సమాధానం చెప్పినట్లే..రాజీవ్ మరణానంతరం అక్కడికేదో సోనియా గాంధీ పాలిటిక్స్ అంటే భయపడ్డట్లు..రాహుల్, ప్రియాంకలు కూడా వెనుకాడినట్లు ప్రచారం చేశారు..ఇప్పుడిక ఆ స్టాక్ డైలాగ్ వర్తించదు..పార్టీ అధ్యక్షపదవి తీసుకుంటాడనే ముందు రోజుల్లోనే మణిశంకర్ అయ్యర్ చేసినట్లుగా చెప్తోన్న కామెంట్లకి రాహుల్ స్వయంగా స్పందించి డిస్మిస్ చేయాల్సి వచ్చింది...సో..ఇదే కాంగ్రెస్ సంస్కృతి..ఇలాంటివెన్నో చూడాల్సి ఉఁటుందనేదానికి అయ్యర్ ఎపిసోడ్ ఓ  ఎగ్జాంపుల్ మాత్రమే 
అయితే రాహుల్ సక్సెస్ ఏంటయ్యా అంటే ఎదురేలేని..తిరుగులేని..మొనగాడు అన్పించుకుంటోన్న మోడీకి ముచ్చెమటలు పట్టించడమే..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గుజరాత్ లో ఓడిపోతే..తొక్క కొత్తగా రాలిపోయే జుట్టేం లేదు..గోచి గుడ్డతో ఉన్నోడికి అది పోయినాపెద్ద లెక్కలేదు..కానీ మోడీ అంతటోడ్ని.." నన్ను చంపేద్దామనుకుంటున్నారు.సుపారీ ఇచ్చారు..నేను బిసిని" అని చెప్పుకునేలా చేశాడంటే రాహుల్ నిజంగా ఇప్పుడు ఓ రోల్ మోడల్ అవడానికి ఎన్నికల్లో నాయకత్వం వహించడానికి తయారైనట్లే.. ఇప్పుడు బిజెపి గెలుపు ముఖ్యంకాదు..మెజార్టీతో గెలవడం ముఖ్యం అనుకునే స్థాయికి వచ్చిందంటేనే రాహుల్ మారిన తీరు అర్ధం చేసుకోవాలి.
ఇప్పటిదాకా పార్టీలో సోనియాగాంధీకి కొంతమంది అనుచరగణం ఉన్నారు..వాళ్లందరికీ రాహుల్ నచ్చకపోవచ్చు..కానీ బైటపడరు..అలానే రాహుల్ గాంధీ కూడా తన టీమ్ ఏర్పాటు చేసుకుంటాడు..అందుకే గులాం నబీ ఆజాద్ ఏకంగా లీడర్లంతా రాహుల్ టీమ్ అనేసుకుని సంబరపడినట్లు తెగ యాక్షన్ చేసేయడం మొదలెట్టాడు. అందుకే రాహుల్‌కి ఇప్పుడు ఈ వృధ్ద జంబూకాలతో పాటు..నవనేతలను మెప్పించడం కాస్త కష్టమైన పని..అయితే నెహ్రూ ఫ్యామిలీకి యాంటీగా మాట్లాడి మనగలగడం అంత తేలికైన పని కాదు..అదే రాహుల్‌కి ప్లస్ పాయింట్..గుజరాత్ ఎన్నికలలో ఆయన అనుసరించిన వ్యూహం తాత్కాలికంగా పని చేయెచ్చోమో కానీ..వ్యూహాలు రచించిన తీరు మాత్రం కాదు.. ఎందుకంటే గతంలోలానే కులరాజకీయాలను బేస్ చేసుకుని ఎర్పాటు చేసిన పొత్తులు ఇవి.. అలానే పార్టీలోకి ఇతరులను ఆహ్వానించడం..ఏ ఏరియాలో వీక్ గా ఉన్నారో అక్కడ బలపడటం...ఎత్తులకు పై ఎత్తులు వేయడంలాంటి మెదడుతో చేసే పనులేవీ అక్కడ చేయలేదు..అందుకే ఈ టెస్ట్ రాహుల్ సామర్ధ్యానికి గీటురాయిగా చెప్పలేం..బిజెపి చేతగాని తనానికి ఓ నిదర్శనంగా చూడాలి...మోడీని ఓడించడమనేది పెద్ద కష్టమైన పనేం కాదని..బిహార్, పంజాబ్, ఢిల్లీ ఇప్పటికే ప్రూవ్ చేసాయ్..ఇప్పుడు గుజరాత్ కూడా చేస్తే..అప్పుడిక 2019 ఎన్నికలు రసవత్తరంగా మారతాయ్. 
అలానే భజనపరులకే పడిపోకుండా పార్టీని తిరిగి అగ్రభాగాన కూర్చుండబెట్టడానికి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఓ ఛాన్స్ వచ్చినట్లే..ఎక్కడికక్కడ ముఖ్యమంత్రులను మార్చడం..వారికి ఆదేశాలివ్వడమనే కల్చర్ ఇకనైనా రాహుల్ పోగొట్టగలిగితే అది కాంగ్రెస్ తో పాటు దేశానికి కూడా మంచిది..
కొత్తనేతలను తయారు చేయడం: ఇప్పటికీ పార్టీలో దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు మేమే రాష్ట్రాలను ఏలతాం అంటూ పాదయాత్రలు చేస్తున్నారు..అలాంటి వారిని కాదని కొత్త నేతలను తయారు చేయడం రాహుల్ చేయాలి. సచిన పైలెట్, జ్యోతిరాదిత్యసింధియా వంటి నేతలను నమ్ముకోవడం కూడా ఓ రకంగా  రాహుల్ పాత పద్దతులను అనుసరిస్తున్నట్లేచ ూడాలి..ఎందుకంటే..ప్రతి నేతకూ తన చుట్టూ ర్యాపో ఉన్నవారిని దగ్గరకు తీయడం టీమ్‌గా మెలగడం మామూలే..ఐతే ఇక్కడే రాహుల్ ప్రతి రాష్ట్రంలో తన అభిప్రాయాలకు దగ్గరైన వారిని గుర్తించి టీమ్ తయారు చేస్తేనే కొత్త లీడర్లు తయారవుతారు..ఇలా చేయడంతో పాత లీడర్లు గుర్రుగా ఉండటం మామాూలే
సోషల్ మీడియాలో రాహుల్ యాక్టివ్ అయిన తీరు చూస్తే..ఇక పాతతరం కాంగ్రెస్ కాదు కొత్త కాంగ్రెస్ పుట్టినట్లే అనుకోవాలి..ఎందుకంటే మోడీకి బలం బలహీనత రెండూ మీడియానే..అలా ఆ మీడియానే వేదికగా చేసుకుని రాహుల్ గబ్బర్ సింగ్ ట్యాక్స్, రోజుకో ప్రశ్నలు వేయడం వంటివి యూత్ పై బాగా ప్రభావం చూపించాయ్..ఐతే ఇవే సరిపోవు ఇంకా కావాలి..
ఆర్ధిక పరిస్థితిని కూడా మోడీ తన క్యాంపైన్‌లో ప్రస్తావిస్తుంటే రాహుల్ దానిని విమర్శించడం వరకే పరిమితం అయ్యారు..ఆయనకంటే ఈయన ఘనుడు అన్పించుకోవాలంటే ఆ మార్పు ఎలా తెస్తాడో కూడా చెప్పగలగాలి..అప్పుడే ఫాలోయర్లు..పెరుగుతారు..అలానే జనంలోకి చొచ్చుకుపోేయేలా ప్రసంగాలూ చేయాలి..తన బామ్మ నాన్నల నాటి భావజాలం, బాడీ లాంగ్వేజ్ కాకుండా  కొత్తగా ట్రై చేసినప్పుడే మాస్ ఆయన్ని ఆదరిస్తారు లేదంటే ఏ ప్రసంగం చూసినా...మీరు గ్రహించదగ్గవాళ్లు..మేం అనుగ్రహించదగ్గ వాళ్లమనేలా జనంలోకి సంకేతాలే వెళ్తాయ్. ఎందుకంటే జనం కూడా మారారు..పాతరోజుల్లోలాగా..ఏది చెప్పినా విని తల ఊపరు..చప్పట్లు మాత్రం కొడతారు..అవి సంతోషంతోనో..లేక ఇక చాలు ఆపమనో...ఈ రెండింటిలో ఏది రాహుల్ చేయగలుగుతాడో అది ఆయనే తేల్చుకోవాలి

Comments