ఇదీ మహిళా స్వేఛ్చా..స్వాతంత్ర్యాలు ఆకాశంలోనూ సగం కాదు..పూర్తి వేధింపులే


ఆకాశంలో సగం..అవకాశాల్లో సగం అంటూ స్లోగన్లు బాగా పేలుతుంటాయ్ కానీ సందు చిక్కితే ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఎలా స్త్రీలను కేవలం ఆడదానిగా చూడటానికి తాపత్రయపడుతుంటారో..ఎలా జుగుప్సగా బిహేవ్ చేస్తుంటారో ఇంకోసారి ప్రూవ్ అయింది. నువ్ పోలీస్ , లాయర్..టీచర్..కార్పొరేట్ ఎంప్లాయీ..సినిమా స్టార్ ఎవరైనా సరే మా దృష్టిలో నువ్వో ఆడదానివి..మాకు అర్జ్ వచ్చినప్పుడు గోక్కోవడానికి మాత్రమే అన్నట్లుగా రెచ్చిపోయే ప్రబుద్దులు ఎలా ఉంటారో...దంగల్ ఫేమ్ జైరా వసీమ్ చూపించింది.

తనకు ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నప్పుడు ఎలా టచ్ చేశాడో..లైట్లు తీసేసినప్పుడు వాడిలోని మృగం ఇంకెలా నిద్రలేచిందో స్వయంగా వివరిస్తూ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఒకటి కలకలం రేపుతోంది

ఇప్పుడు తీరిగ్గా ఫ్లైట్ సిబ్బంది అప్పుడు గాడిదలు కాస్తూ..ఇప్పుడు మాత్రం విచారిస్తున్నారట..ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా విచారిస్తున్నారట...ఇక పోలీసులు కూడా అదే పని...విచారిస్తున్నారట..

Comments