యానాంలో దుమ్ము రేపింది


యానాంలో ఓ లేడీ ఈవ్ టీజర్‌కి చుక్కులు చూపించింది. చేయి వేయబోతే ఇరగదీసిందిచేత్తో తాకబోతే కాళ్లూ చేతులతో మర్దించేసింది. యానాంలోని ఓ గవర్నమెంట్ ఆఫీస్ బహుశా ఎమ్మార్వో కార్యాలయానికి అనుకుంటా వెళ్లిందీ లేడీ అక్కడే ఉన్న ఈ మందుబాబుకి ఏమనిపించిందో ఏమో తైతక్కలాడబోయాడు..చేయి వేస్తే ఏమవుద్దో చూద్దామనుకున్నాడో కానీ..ఇక ఆతర్వాత మనోడి చేతిలో ఏమీ మిగల్లేదు. సదరు లేడీ ఎగబడి మరీ పీకుతుంటే నోరు పెగల్లేకుండా అలా తన్నించుకుంటూ ఉండిపోయాడు

ఓ వేళ ఎక్స్ ట్రా చేద్దామంటే జనం కూడా ఆమెకీ సపోర్ట్ ఇస్తున్నారు..దీంతో మనోడి పని తిరణాల్లో దొరికిన కుక్కలా అయిపోయింది. నోరు మెదిపితే ఎక్కడఇంకా కుమ్మేస్తారనుకున్నాడో మరి. దీంతో సదరు లేడీ కుమ్ముడు పూర్తైన తర్వాత స్కూటీ వేస్కుని జంప్ అవగా..వీడు మాత్రం మట్టిలో దొర్లుతూనే ఉండిపోయాడు

Comments