ఎందుకు ఊరేగింపు ? పార్టీ మారినా రిజైన్ చేయనందుకా?


అప్పట్లో వైఎస్ జగన్ వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలపై తెగ విమర్శలు వచ్చేవి. రాజీనామాలు చేయకుండానే ఇలా తిరగడం వ్యభిచారంతో సమానమని తీవ్రస్థాయిలో రెచ్చిపోయేవారు కాంగ్రెస్ నేతలు..ఐతే వాటికి ధీటుగానా అన్నట్లు జగన్ వెంట తిరిగిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారు 18మందిలో 16మంది బారీ మెజార్టీతో గెలిచారు. ఐనా ఈ నిజాన్ని దాచిపెట్టి మరీ అప్పట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు  ఎందుకు రాజీనామా చేయలేదని నిర్లజ్జగా ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ జైల్లో పడ్డవారే..ఐతే వాళ్లిద్దరూ బైటికి వచ్చిన సందర్భంలో భారీగా స్వాగతం పలికితే అది తప్పుబట్టినవారు ఉన్నారు. దాన్ని సమర్ధించినవారూ ఉన్నారు.ఐతే ఇప్పుడు వైజాగ్ ట్రైబల్ ఏరియాలో పార్టీ జంప్ కొట్టిన ఓ మహిళా ఎమ్మెల్యే దేశానికేదో ఊడబొడిచినట్లు భారీగా ఊరేగింపు ఏర్పాటు చేయడం నిజంగా సిగ్గుచేటే..ఓ వేళ పార్టీ అభివృధ్ది చేస్తుందిఅంటే కనీసం ఆ హామీలు..విడుదల చేసిన నిధులను ఊరేగించుకుంటూ డప్పు కొట్టుకుంటూ తిరగొచ్చు..ఏమీ లేకుండా ఉత్తినే ఉత్త చేతులతో ఊపుకుంటూ నగరమంతా తిరగడానికి నిజంగా సిగ్గుండాలి..పైగా ఏదో సాధించేశానన్నట్లుగా చేతులు ఊపుతుంటే జనం నవ్వుకోరా..ఇది ఏ పార్టీ వాళ్లకైనా వర్తిస్తుంది..పైగా పాడేరులో స్వయంగా ఆమే 2019లో  ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పిన తర్వాత కూడా ఇలానే వ్యవహరిస్తున్నారంటే ఏమనుకోవాలి

పార్టీ మారాను..ఐనా రాజీనామా చేయలేదు..నా పార్టీ  ఆదేశిస్తే రాజీనామా చేస్తా  అంటూ డైలాగులేస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఏ ఓటరూ ఏమీ చేయలేడనే కదా అర్ధం..ఈ రాత ఒక్క ఈ ఎంపి, ఎమ్మెల్యేలకే కాదు..రేపొద్దున వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఇతరులను చేర్చుకున్నా ఇలానే స్పందిస్తాం..దమ్ముంటే రాజీనామా చేయాలి..లేదంటే అన్నీ మూసుకుని కూర్చోవాలి..ఇది మా మాట కాదు..జనం మాట..కాదంటారా

Comments