ఇలా ఏపీ, తెలంగాణలొ ఏ కానిస్టేబులైనా చేయగలరా


పొలీసులలొ పొలైట్‌నెస్ కాస్త లైట్‌గానే ఉఁటుంది. ఇక్కడ నిలబడరాదు అనే విషయాన్ని కూడా రేయ్  ఇక్కడ్నుంచి పొండి అనే రేంజ్‌లొ చెప్తుంటారు. ఫ్రెండ్లీ పొలీసింగ్ అనేది జరుగుతున్నా...మక్కెలు విరగ్గొట్టిన తర్వాత సారీ చెప్పగల సమర్ధులు కూడా..ఐతే ఇంత చేసినా...పొలిటికల్ బాసుల ముందు మాత్రం మనొళ్లు హ్యాపీగా శాల్యూట్‌ల సెంచరీలు కొట్టేస్తుంటారు. వాళ్లని కనీసం తాకే ప్రయత్నం కూడా చేయలేరు. కానీ హిమాచల్ ప్రదేశ్‌లొ మాత్రం సీన్ కాస్త రివర్స్ అయింది. ఆశా కుమారి అనే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే   ఒక కానిస్టేబుల్‌పై చేయి చేసుకుంది. ఈ ఇన్సిడెంట్
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లొ కాంగ్రెస్ పరాజయంపై పొస్ట్ మార్టమ్ నిర్వహించడానికి రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలొ జరిగింది.
కానిస్టేబుల్‌ చేసిన తప్పు ఏంటయ్యా  అంటే ఫుల్ రష్‌గా ఉన్నా..తొసుకుని సమావేశం జరుగుతున్న మీటింగ్‌ హాల్‌లొకి ఎమ్మెల్యే వెళ్లడానికి ట్రై చేయడమే..ఐతే ఎమ్మెల్యేని కానిస్టేబుల్ అడ్డుకున్నది. వెంటనే ఆమె ఒక దెబ్బ వేసింది. లేడీ కానిస్టేబుల్‌కి వెంటనే పిచ్చ రేగిందేమొ తాను కూడా పెళ్లుమంటూ ఒకటి పీకింది. దీంతొ అప్పటికే అలర్టై ఉన్న మిగిలిన అనుచరగణం మరొ దెబ్బ పీకకముందే జారుకుంటూ బెటర్  అనుకున్నట్లున్నారు ఆషాకుమారిని సైడ్  చేేశారు. మరి ఇలా ఏ ఎమ్మెల్యైనైనా మన కానిస్టేబుళ్లు పీకగలరా..కనీసం అడ్డుకునే సాహసమైనా చేయగలరా

video courtesy : ani news

Comments