RK నగర్ BYPOLL రిజల్ట్ ఏం చెప్తుంది..నేర్చుకుని తీరాల్సిన పాఠం ఇది MODI


అవినీతి, జయలలితను దాదాపు మర్డర్ చేశారు..ఇవీ దినకరన్ వర్గం(శశికళ)పై ఎలిగేషన్స్..ఐతేనేం ఇండిపెండెంట్‌గా దిగి మరీ తనకున్న బలమేంటొ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు..పైగా  ఒ మొనగాడు పార్టీకి ఎంత టాలెంట్ ఉఁదొ కూడా తేటతెల్లం చేశాడు..ఇదీ కాంగ్రెస్ ముక్త భారత్..నినాద నాదానికి తమిళనాడులొ దక్కిన మద్దతు..అసలు ఆ మాటకి వస్తే తమిళనాడులొ కాంగ్రెస్ పవర్ పగ్గాలు దక్కక చాలా ఏళ్లే అయింది దాని గురించి చర్చించుకొవడం దండగ..ఇప్పుడు దినకరన్..తిరిగి తమిళనాట మన్నార్ గుడి హవా వీయడానికి సాయం చేస్తాడా, శశికళ వర్గం పట్టు సాధిస్తుందా అనేదే ఎవరైనా అనుకునే ప్రశ్నలు

20వేల ఒట్ల మెజారిటీ దక్కడం తక్కువగా చూడాల్సిన విజయం ఏం కాదు..కానీ బైపొల్‌తొనే ఆ రాష్ట్రమంతా కూడా సీన్ మారిపొతుందనే మన తెలుగు ఛానళ్ల ఆపసొపాలు కరెక్ట్ కాదు..ఎందుకంటే పక్కనెక్కడొ ఏం జరిగినా తెగ బ్రేకింగులు పెట్టుకుని సంతొషపడే మన జనం ఇక్కడి నాడినే పట్టుకొలేరు..పైగా తమిళనాడులొ కమల్ హసన్ వస్తాడు..రజనీకాంత్ సపొర్ట్ ఎవడొకడికి అన్యాపదేశంగా ఇస్తాడు, ఇన్ని ఈక్వేషన్ల మధ్య అప్పుడే అక్కడ సిత్రాలు మారిపొయాయని చెప్పుకొవడం ఆత్మసంతృప్తే..అక్కడ జయలలిత ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వీడియొ విజువల్ రావడం దాన్ని ఆస్పత్రి కూడా (apollo) నిర్ధారించడం కాస్త కుట్రే ఎందుకంటే..జయలలిత వీడియొ చూస్తుంటే ఎక్కడొ ఏదొ తెడా క్లియర్‌గా కన్పిస్తుంది.. ఆ చేయి లేచే విధానమే ఏదొ ఎవరొ బాడికి  అతికించినట్లు ఉఁది. జయలలిత తల కూడా అసహజరీతిలొ కదలుతుంది..చూస్తుంటే మార్ఫింగ్ వ్యవహారంలా ఉంది తప్ప నిజమైందిలా లేదు. లేకపొతే అప్పట్లొ అంత గొడవ జరుగుతుంటే బైటికిరాని వీడియొ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసారొ ఊహించడం పెద్ద కష్టం కాదు.


 కానీ జయలలిత అంత్యక్రియలు, ఆ తర్వాత జరిగిన నాటకం, ఈ మధ్యనే కరుణానిది ఇఁటికిపొయి ఢిల్లీ రమ్మనడం. తర్వాత 2జి కేసులొ తీర్పు డిఎంకేకి అనుకూలంగా రావడం ఇలాంటి డెవలప్‌మెంట్స్ తర్వాత ఢిల్లీ హీరొ పార్టీకి వచ్చిన ఒట్లు చూస్తే ...సిగ్గుతొ తల ఎక్కడ పెట్టుకొవాలొ తెలియదేమొ..నొటాకి వచ్చిన ఒట్లకంటే కూడా తక్కువ ఇది చాలు..నేషనల్ పార్టీకి దక్షిణాదిన దక్కుతొన్న గుర్తింపు..అర్ధం పర్ధం లేకుండా దొంగదారిలొ విస్తరించడానికి ముందుకు వస్తే ఎలా ఉంటుందొ అరవతంబిలు బాగా చూపించారు..నెక్ట్స్ వంతు ఏపీ, తెలంగాణ వాసులదే

Comments