3 నెలలంటే మావాళ్లకి 3 ఏళ్లే


రాజ్యసభ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి పాత్రలో వెంకయ్యనాయుడు ఇద్దరు జేడీయూ ఎంపీలను డిస్మిస్ చేసేసి ఓ సంకేతం పారేశారు. ఆ తర్వాత కూడా అదే చెప్పారు. ఫిరాయింపుదార్లపై ఖచ్చితంగా 3 నెలల్లోగా నిర్ణయాలు తీసుకోవాలని. ఇది అందరికీ వర్తిస్తుంది తెలుగు స్పీకర్లు ఏం చేస్తారో వారి ఇష్టం అని చెప్పారు. కానీ మన తెలుగు జనానికి నెల అంటే నెల కాదు ( తెలంగాణపై షిండే, గులాంనబీ ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలే చేసేవాళ్లు) 

ఆల్మోస్ట్ ఇంక ఒక్క సంవత్సరం ఉంది ఎన్నికలకు..పార్టీలు మారి మంత్రులైపోయినవాళ్లు తెలంగాణలో మూడేళ్లుగా ఎంజాయ్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. మరి వాళ్లకి ఈ మాత్రం గడువు చాలదంటే అర్ధం మూడు నెలలంటే మూడేళ్లే అనుకోవాలి. ముందుగా ఎంపిగా ప్రమాణస్వీకారం కూడా చేయని ఎస్పీవైరెడ్డి ఈ జాబితాలోముందు తన వీరతాడు వేయించుకోగా.. ఆ తర్వాత టిఆర్ఎస్ తన వల విసరడం ప్రారంభించింది. ఆ దెబ్బకి తెలంగాణలో టిడిపి పత్తా లేకుండా పోయింది అనర్హత వేటు వేయాలని కోరిన వారే ఆ తర్వాత తాము టిఆర్ఎస్‌లో విలీనం చేసామనే దశకు దిగజారిపోయారు. 

తెలంగాణలో ఇప్పుడు కాస్త కన్సాలిడేషన్ జరిగినా..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా జంపింగులు జరుగుతూనే ఉన్నాయ్. అసలు ఇంకో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని కూడా ఇంకా అభివృధ్ధి..మట్టి మశానం అంటూ నినాదాలు ఇవ్వడంలో అర్ధం ఏమైనా కన్పిస్తుందా. మరి ఈ దశలో వెంకయ్య ప్రభోధం  ఎవరిని ఏ తీరాలకు చేర్చుతుందో చూడాలి

Comments